పుట్టినరోజున 'సాహో' ఫస్ట్ లుక్ రిలీజ్

Last Updated : Oct 23, 2017, 10:38 AM IST
పుట్టినరోజున 'సాహో' ఫస్ట్ లుక్ రిలీజ్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు (అక్టోబర్ 23) సందర్భంగా తాజా చిత్రం 'సాహో' ఫస్ట్ లుక్ విడుదలైంది. మంచు కురుస్తున్న రాత్రి వేళ నల్లటి కోటు ధరించి, ముఖం సగం కనిపించేలా నల్లటి ముసుగు వేసుకుని, కోటు జేబులో కుడిచేయి, ఎడమచేయితో  ఫొన్ లో మాట్లాడుతూ స్టైలిష్ గా రోడ్డుమీద నడుస్తూ వస్తున్న ప్రభాస్ ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాడు. 'బాహుబలి' ఘనవిజయం తర్వాత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ నటిస్తోంది. సుజీత్ ఈ సినిమాకు దర్శకుడు. 

ఈ సందర్భంగా ప్రభాస్ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. 'మీ ప్రేమకు, విషెష్ కు చాలా థ్యాంక్స్. మీ కోసం సాహో ఫస్ట్ లుక్' అంటూ ట్వీట్ చేసాడు. 

 

Trending News