RRR fan death: ఆర్​ఆర్​ఆర్​ మూవీ చూస్తూ అభిమానకి గుండెపోటు.. థియేటర్లోనే మృతి!

RRR fan death: థియేటర్లో ఎంతో ఉత్సాహంతో ఆర్​ఆర్​ఆర్​ సినిమా చూసేందుకు వెళ్లిన ఓ అభిమాని థియేటర్లోనే కుప్పకూలాడు. గుండె పోటుతో కుప్పకూలిన అతడిని ఆస్పత్రికి తిసుకెళ్లే లోపో ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 25, 2022, 11:58 AM IST
  • ఆర్​ఆర్​ఆర్​ సినిమా చూస్తూ అభిమాని మృతి
  • గుండె పోటు రావడంతో థియేటర్లోనే కుప్పకూలిన వ్యక్తి
  • అనంతపురంలో చోటు చేసుకున్న ఘటన
RRR fan death: ఆర్​ఆర్​ఆర్​ మూవీ చూస్తూ అభిమానకి గుండెపోటు.. థియేటర్లోనే మృతి!

RRR fan death: ఎన్​టీఆర్​, రామ్​ చరణ్​ హీరోలుగా జక్కన రాజమౌళి తెరక్కించిన ఆర్​ఆర్​ఆర్​ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీని మొదటి రోజే చూసేందుకు నానా ప్రయత్నాలు చేసి.. ఎట్టకేలకు థియేటర్లకు వెళ్తున్నారు.

ఇలానే తొలి రోజే మూవీ చూసేందుకు వెళ్లిన ఓ అభిమాని థియేటర్లోన ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది.

ఇంతకీ ఏమైందంటే..

అనంతపురంలో ఎస్​వీ మ్యాక్స్ థియేటర్​లో ఆర్ఆర్​ఆర్​ మూవీ చూస్తూ గుండెపోటుతో ఓ అభిమాని చనిపోయాడు. అభిమాన హీరో యాక్షన్​కు ఈలలు వేస్తూ.. అ సన్ని వేషాలను ఫొటోలు తీసుకుంటూ.. ప్రాణాలు విడుచాడు ఆ అభిమాని.

హఠాత్తుగా అతడు కింద పడిపోవడంతో అతడితోపాటు వచ్చిన వాళ్లు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయిన ఫలితం లేకపోయింది. అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

Also read: RRR Movie Collections: ఆర్‌ఆర్‌ఆర్‌ తొలిరోజు కలెక్షన్స్.. ఎంతో తెలిస్తే షాకే!!

Also read: RRR Collection in USA: ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్.. USA ప్రీమియర్స్ లో 3 మిలియన్ డాలర్లు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News