RRR Movie Trailer: ఆర్ఆర్ఆర్ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు రిలీజ్?

RRR Movie Trailer: దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదలకు సిద్ధమైంది. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్ ను  విడుదల చేసేందుకు చిత్రబృందం ప్రకటన చేసింది. డిసెంబరు 3న సినిమా ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 29, 2021, 04:57 PM IST
    • ఆర్ఆర్ఆర్ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
    • డిసెంబరు 3న విడుదల చేయనున్నట్లు ప్రకటన
    • జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న చిత్రం
RRR Movie Trailer: ఆర్ఆర్ఆర్ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు రిలీజ్?

RRR Movie Trailer: దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 7న రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషలు సహా ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు మేకర్స్.

ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘దోస్తీ’, ‘నాటు నాటు‘, ‘జనని‘ పాటలకు ప్రేక్షకుల నుంచి విశేషాదరణ దక్కుతోంది. ‘నాటు నాటు’ సాంగ్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. చరణ్, తారక్ కలిసి వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. వారి లాగా డ్రెసింగ్ చేసుకొని ఆ పాటకు స్టెప్పులేస్తూ యూట్యూబ్ లో వీడియోలు షేర్ చేస్తున్నారు.

ఇప్పుడు సినిమా విడుదల దగ్గర పడుతుండడం వల్ల చిత్ర ప్రమోషన్స్ ను మేకర్స్ మొదలు పెట్టేశారు. ఈ సినిమా ట్రైలర్ ను డిసెంబరు 3న విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. అయితే ఈ ట్రైలర్ రిలీజ్ వేడుకను ముంబయిలో నిర్వహించి.. బాలీవుడ్ నుంచి ఓ స్పెషల్ గెస్ట్ ను అతిథిగా పిలవాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

అయితే అంతకు ముందు విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన 45 సెకన్ల గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. అద్భుతమైన విజువల్స్, అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్​తో ఇది అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. 45 సెకన్ల నిడివి ఉన్న ఈ స్పెషల్‌ వీడియో.. ఇప్పటివరకూ వచ్చిన సర్‌ప్రైజ్‌లకు భిన్నంగా రామ్‌చరణ్‌-తారక్‌ కలిసి ఉన్న సన్నివేశాలతో రూపొందించారు.

రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందించినట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్​ నటిస్తున్నారు. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతమందిస్తున్నారు. అలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Also Read: Bigg Boss Telugu Season 5 Promo: ప్రియాంకకు బిగ్ బాస్ సీరియస్ వార్నింగ్.. ఏం జరిగింది?

Also Read: Pushpa Movie Release Date: అల్లు అర్జున్ పుష్ప ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News