RRR Movie Leaked Online: RRR మూవీకి తప్పని పైరసీ బెడద.. ఆన్ లైన్ లో ఫుల్ HD ప్రింట్?

RRR Movie Leaked Online: దిగ్గజ దర్శకుడు రాజమౌళి సినిమా 'ఆర్ఆర్ఆర్' కూడా పైరసీ బెడద తప్పడం లేదు. శుక్రవారం (మార్చి 25) సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే పూర్తి ప్రింట్ ఆన్ లైన్ దర్శనమిచ్చింది. దీనిపై చరణ్, తారక్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 25, 2022, 05:17 PM IST
RRR Movie Leaked Online: RRR మూవీకి తప్పని పైరసీ బెడద.. ఆన్ లైన్ లో ఫుల్ HD ప్రింట్?

RRR Movie Leaked Online: దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' మూవీ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. 'బాహుబలి 2' తర్వాత అంతటి రేంజ్ లో కలెక్షన్స్ సాధించే దిశగా ఈ చిత్రం దూసుకెళ్తోంది. అయితే ఎంత పెద్ద సినిమాకైనా పైరసీ బెడద మాత్రం తప్పడం లేదు. 

ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్ పైరసీ వెబ్ సైట్లలో దర్శనమిచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పాటు పూర్తి సినిమా HD ప్రింట్ ను కూడా కేటుగాళ్లు ఆన్ లైన్ లో రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై రామ్ చరణ్, తారక్ ఫ్యాన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే పూర్తి HD ప్రింట్ బయటకు రావడం బాధకరమని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పైరసీ కారణంగా చిత్ర కలెక్షన్స్ పై ప్రభావం పడే అవకాశం ఉంది.  

ఇంతకు ముందు టాలీవుడ్ నుంచి విడుదలైన 'పుష్ప', 'అఖండ', 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్', 'శ్యామ్ సింగరాయ్', 'బంగార్రాజు', 'డీజే టిల్లు', 'ఖిలాడి' వంటి చిత్రాలు కూడా థియేటర్లలో విడుదలైన కొద్ది గంటల్లోనే ఆన్ లైన్ లో పైరసీ ప్రింట్స్ దర్శనమిచ్చాయి. 

రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటించి మెప్పించారు. వీరి సరసన బాలీవుడ్ నటి ఆలియా భట్, హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్ నటించారు. వీరితో పాటు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రఖని, రాజీవ్ కనకాల, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలో పోషించారు. కీరవాణి సంగీతాన్ని అందించగా.. డీవీవీ దానయ్య సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. 

Also Read: RRR Collection in USA: ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్.. USA ప్రీమియర్స్ లో 3 మిలియన్ డాలర్లు!

Also Read: Ram Charan Boxing: RRR మూవీ ఆ ఒక్క సీన్ కోసం రామ్ చరణ్ ఎంత కష్టపడ్డాడో చూడండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News