Alia Bhatt Pictures: రణబీర్ కపూర్ ఫోటోగ్రఫీ.. అద్భుతంగా ఉన్న ఆలియా భట్!!

కెన్యాలోని మాసాయి మారాలో బాయ్‌ఫ్రెండ్ రణబీర్ కపూర్‌తో కలిసి ఆలియా భట్ ఎంజాయ్ చేస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 7, 2022, 02:24 PM IST
  • రణబీర్ కపూర్ ఫోటోగ్రఫీ
  • అద్భుతంగా ఉన్న ఆలియా భట్
  • వివాహ ముహుర్తం ఫిక్స్‌ అవ్వడం లేదు
Alia Bhatt Pictures: రణబీర్ కపూర్ ఫోటోగ్రఫీ.. అద్భుతంగా ఉన్న ఆలియా భట్!!

 RRR Movie Actress Alia Bhatt shared photos: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ (Alia Bhatt).. ఆర్ఆర్ఆర్ సినిమా (RRR Movie) ద్వారా తెలుగు తెరకు తొలిసారి పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సరసన సీత పాత్రలో ఆలియా నటించారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఆర్ఆర్ఆర్ సినిమా.. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కారణంగా నిరవధిక వాయిదా పడింది. లేకపోతే ఆలియా ఇప్పటికే తెలుగు తెరపై సందడి చేసేవారు. ఇక ప్రస్తుతం సినిమా షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చిన ఆలియా.. విహార యాత్రలో ఉన్నారు. 

బాయ్‌ఫ్రెండ్ రణబీర్ కపూర్‌ (Ranbir Kapoor)తో కలిసి ఆలియా భట్ కెన్యాలో ఉన్నారు. కెన్యాలోని మాసాయి మారాలో బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల కోసం వెళ్లిన ఈ బాలీవుడ్‌ ప్రేమ జంట అక్కడి ప్రకృతిని ఆశ్వాసాదిస్తున్నారు. కెన్యా పర్యటనకు సంబందించిన ఫొటోలను ఆలియా ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రణబీర్ కపూర్ ఫోటోగ్రఫీ నైపుణాలను (Ranbir Kapoor Photography Skills) షేర్ చేశారు. ఆలియా పోజులు ఇస్తుండగా.. రణబీర్ ఫొటోలు తీశాడు. 

Also Read: Ben Stokes: స్టోక్స్ కాక.. అదృష్టం అంటే నీదే పో! బంతి స్టంప్‌కు తాకినా బతికిపోయావుగా (వీడియో)!!

ఆలియా భట్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫొటోలు (Alia Bhatt Photos) పోస్ట్ చేసి.. రణబీర్ కపూర్‌కు క్రెడిట్ ఇచ్చారు. 'నా బాయ్‌ఫ్రెండ్ ఫోటోగ్రఫీ నైపుణ్యాలు చాలా బాగున్నాయి' అని కాప్షన్ ఇచ్చారు. ఆలియా ఫోటోలలో నవ్వుతూ అందంగా ఉన్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోస్ట్ చేసి కొద్దినిమిషాలే అయినా.. ఇప్పటికే లైకుల, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. 'రణబీర్ కపూర్ ఫోటోగ్రఫీ సూపర్ ','ఆలియా భట్ అద్భుతంగా ఉన్నారు' అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

 
 
 
 
 

అలియా భట్‌తో ప్రేమలో ఉన్నట్లు రణ్‌బీర్‌ కపూర్‌ 2020లో ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. అప్పటినుంచి ఈ జంట కలిసే తిరుగుతున్నారు. గతేడాది రణథంబోర్‌లో కుటుంబ సభ్యులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. రణబీర్ కపూర్ 39వ పుట్టినరోజు సందర్భంగా ఈ జంట జోధ్‌పూర్‌కు విహారయాత్రకు వెళ్లారు. ఇప్పుడు కెన్యాలో చక్కర్లు కొడుతున్నారు. అలియా- రణ్‌బీర్‌  పెళ్లి కోసం బాలీవుడ్‌ పెద్దలతో పాటు అందరూ ఎదురుచూస్తునారు. వీరిద్దరి పెళ్లి అంటూ గతేడాది నుంచి ప్రచారం జరుగుతూనే ఉన్నా.. వివాహ ముహుర్తం మాత్రం ఫిక్స్‌ అవ్వడం లేదు.

Also Read: Nidhhi Agerwal Photos: బ్లాక్ శారీలో చందమామలా మెరిసిపోతున్న అందాల నిధి- ఫొటోలు వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

  

Trending News