RRR team in Bigg Boss 15 : సల్మాన్‌ఖాన్‌కు స్టెప్స్ నేర్పించిన ఎన్టీఆర్, రామ్‌ చరణ్.. బిగ్‌ బాస్‌ షోలో ఆర్ఆర్ఆర్ టీమ్‌ సందడి

Jr NTR, Ram Charan, Alia Bhatt in Bigg Boss 15 : హిందీ పాపులర్ టీవీ రియాల్టీ షో బిగ్ బాస్ 15లో తళుక్కుమంది ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్. ఎన్టీఆర్, రామ్‌ చరణ్, అలియాభట్, షోకు అతిథులుగా హాజరై సందడి చేశారు. సల్మాన్‌ఖాన్‌కు ఎన్టీఆర్, రామ్‌ చరణ్ పాటకు స్టెప్స్ ఎలా వేయాలో కూడా సింపుల్‌గా నేర్పించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 25, 2021, 12:30 PM IST
  • రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ ప్రమోషన్స్ జోరు
  • జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తోన్న మూవీ యూనిట్
  • హిందీ పాపులర్ టీవీ రియాల్టీ షో బిగ్ బాస్ 15లో సందడి చేసిన ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్
  • సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న ఎపిసోడ్ ప్రోమో
RRR team in Bigg Boss 15 : సల్మాన్‌ఖాన్‌కు స్టెప్స్ నేర్పించిన ఎన్టీఆర్, రామ్‌ చరణ్.. బిగ్‌ బాస్‌ షోలో ఆర్ఆర్ఆర్ టీమ్‌ సందడి

RRR movie actors Jr NTR, Ram Charan, Alia Bhatt to be seen on Salman Khan hosted show Bigg Boss 15: ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌ (రౌద్రం...రణం...రుధిరం). ఈ పాన్‌ ఇండియా మూవీ 2022 జనవరి 7న రిలీజ్ కానుంది. ఈ మూవీ కోసం సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ మేకర్స్ ప్రమోషన్స్ జోరు పెంచారు. ప్రమోషన్స్‌లో జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తోంది మూవీ యూనిట్. ఎట్‌ ఏ టైమ్‌ అటు బాలీవుడ్‌లో.. ఇటు సౌత్‌లో సినిమాపై హైప్ పెంచేస్తోంది మూవీ యూనిట్. 

ఈ క్రమంలో హిందీ పాపులర్ టీవీ రియాల్టీ షో బిగ్ బాస్ 15లో తళుక్కుమంది ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR movie) టీమ్. ఎన్టీఆర్, రామ్‌ చరణ్, అలియాభట్, షోకు అతిథులుగా హాజరై సందడి చేశారు. ఈ స్పెషల్ ఎపిసోడ్ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

బిగ్ బాస్ 15 హిందీ షోలో (Bigg Boss 15 Hindi Show) హోస్ట్ సల్మాన్‌ఖాన్‌తో (Salman Khan) కలిసి తారక్, చెర్రీ, అలియాభట్ ఆర్ఆర్ఆర్ హిందీ మూవీలోని (RRR Hindi Movie) నాచో నాచో సాంగ్‌కు స్టెప్స్‌ వేశారు. సల్మాన్‌ఖాన్‌కు ఎన్టీఆర్, రామ్‌ చరణ్ ఆ పాటకు స్టెప్స్ ఎలా వేయాలో కూడా సింపుల్‌గా నేర్పించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు సల్మాన్ ఖాన్ తారక్, చెర్రీ, అలియాభట్, రాజమౌళితో కలిసి తన బర్త్‌ డే వేడుకలను కూడా జరుపుకున్నారు. ఇక ఈ బిగ్ బాస్ 15 హిందీ షో ఫుల్ ఎపిసోడ్ త్వరలో టెలికాస్ట్ కానుంది.

Also Read : Bank Holidays January 2022: జనవరిలో మొత్తం 16 బ్యాంక్ హాలిడేస్​- పూర్తి వివరాలివే..

ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు (RRR pre release event) సంబంధించిన షూట్ మొత్తం ఇప్పటికే ముంబైలో పూర్తయింది. అయితే న్యూ ఇయర్ సందర్భంగా ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ టెలికాస్ట్ అవుతుందని టాక్. ఈ కార్యక్రమానికి కూడా చీఫ్ గెస్ట్‌గా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ (Bollywood hero Salman Khan) హాజరయ్యారట. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లపై సల్మాన్‌ ప్రశంసల వర్షం కురిపించారట. 

తనకు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) యాక్టింగ్ చాలా ఇష్టమని.. సల్లూ భాయ్ చెప్పారట. అలాగే తాను చెర్రీని కలిసిన ప్రతిసారీ.. షూటింగ్‌లో భాగంగా ఏదో గాయంతో బాధపడుతుండానని చెప్పుకొచ్చారట. సినిమా కోసం చెర్రీ పడే శ్రమ అలాంటిదని మెచ్చుకున్నారట సల్లూ భాయ్. ముంబైలో జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు (Mumbai pre release event) భారీగానే ఖర్చు చేశారు.

ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలో (RRR movie) ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ సరస అలియాభట్‌, ఒలివియా మోరిస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించారు.

 

Also Read : Best Christmas Greetings: మీ బంధుమిత్రులకు బెస్ట్ క్రిస్మస్ గ్రీటింగ్ కార్డ్స్ ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

 

Trending News