RRR Mania: తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ మానియా.. థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి!

RRR Mania: రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' శుక్రవారం గ్రాండ్ రిలీజ్ అయ్యింది. గురువారం రాత్రి నుంచి ఇరు తెలుగు రాష్ట్రాల్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. మరోవైపు హీరోలు కూడా అభిమానుల నడుమ సినిమాను వీక్షించారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 25, 2022, 10:22 AM IST
RRR Mania: తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ మానియా.. థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి!

RRR Mania: దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 'ఆర్ఆర్ఆర్' (రణం రౌద్రం రుధిరం) చిత్రం.. శుక్రవారం (మార్చి 25) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఓవర్సీస్ లో గురువారం (మార్చి 24) రాత్రి నుంచే షోలు ప్రారంభమయ్యాయి. మరోవైపు శుక్రవారం తెల్లవారుజామున నుంచే తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షో లతో 'ఆర్ఆర్ఆర్' మానియా మొదలైంది. రామ్ చరణ్, తారక్ ఫ్యాన్స్ థియేటర్లలో సందడి చేస్తున్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ మల్టీస్టారర్ చిత్రం విడుదల సందర్భంగా వీరి అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. తాము అభిమానించే హీరోల కటౌట్లు కట్టిన ఫ్యాన్స్.. వాటికి పూల దండలు, పాలాభిషేకాలు చేస్తున్నారు. అనేక చోట్ల బాణాసంచా కాలుస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

ఫ్యామిలీతో సినిమా చూసిన హీరోలు..

'ఆర్ఆర్ఆర్' మూవీలో ప్రధానపాత్రలు వహించిన హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్.. తమ కుటుంబసభ్యులతో కలిసి సినిమాను వీక్షించారు. రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన సహా ఇతర కుటుంబసభ్యులతో కలిసి కూకట్ పల్లిలోని భ్రమరాంబ థియేటర్ లో సినిమాను వీక్షించారు. మరోవైపు ఎన్టీఆర్, ఆయన భార్య లక్ష్మీ ప్రణతితో పాటు పిల్లల అభయ్ రామ్, భార్గవ్ రామ్ తో కలిసి ఏఎంబీ మాల్ లో సినిమా చూశారు.  

ALso Read: RRR review: ఆర్​ఆర్​ఆర్​ ఓవర్​సిస్​ రివ్యూ వచ్చేసింది- మూవీ రికార్డులు సృష్టిస్తుందా?

Also Read: RRR Movie Review: ఆర్‌ఆర్‌ఆర్‌ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News