Buy Gas Cylinder to get Free RRR Movie Tickets in Duggirala: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 'ఆర్ఆర్ఆర్' మూవీ మేనియా నడుస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని కదిలించినా.. ఆర్ఆర్ఆర్, ఆర్ఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ అనే అంటున్నారు. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండంతో.. నందమూరి, మెగా అభిమానులు అయితే ఆర్ఆర్ఆర్ టిక్కెట్ల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పటికే టిక్కెట్ బుకింగ్స్ అక్కడక్కడా ప్రారంభం కాగా.. హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. దాంతో ఆన్ లైన్, ఆఫ్ లైన్ అంటూ.. టిక్కెట్లు సంపాదించే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో పలువురు వ్యాపారులు ఆర్ఆర్ఆర్ క్రేజ్‌ను సొమ్ముచేసుకోవాలని చూస్తున్నారు.
ఏపీలోని గుంటూరు జిల్లా దుగ్గిరాలలోని 'ఇన్సాన్ హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ' ఆర్ఆర్ఆర్ మేనియాను బాగా వాడుకుంటుంది. ఇన్సాన్ ఏజెన్సీ వినూత్నంగా ఆలోచించి ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. సింగిల్ గ్యాస్ సిలిండర్ ఉన్న వినియోగదారులు మరో సిలిండర్ తీసుకుంటే.. ఉచితంగా ఆర్ఆర్ఆర్ సినిమా టిక్కెట్లు ఇస్తామని ఆఫర్ ప్రకటించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేసింది. 'హెచ్‌పీ గ్యాస్ సిలిండర్ ఆర్ఆర్ఆర్ ధమాకా ఆఫర్' అని కాప్షన్ పెట్టారు. ఇక ఫ్లెక్సీలో రెండు సిలిండర్లపై హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ బొమ్మలను ఉంచింది.
ఇన్సాన్ ఏజెన్సీ ఫ్లెక్సీ దుగ్గిరాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ విషయం సోషల్ మీడియా పుణ్యమా అని తొందరగానే అందరికి తెలిసింది. ప్రస్తుతం ఈ ఆఫర్ నెట్టింట వైరల్ అయింది. దీంతో కొందరు అవసరం ఉన్న అభిమానులు సిలిండర్ కొనుగోలుకు వెళుతున్నారు. ఇప్పటివరకు ముగ్గురు వినియోగదారులు సిలిండర్లు బుక్ చేసుకున్నారని ఇన్సాన్ హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు శ్రీనివాసరావు తెలిపారు. ఆర్ఆర్ఆర్ సినిమా విధులకు ఇంకా సమయం ఉండడంతో ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మార్చి 25న ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల అవుతున్న విషయం తెలిసిందే.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన సినిమా రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్). దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఎన్నో సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 25న విడుదల కానుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామని ఫాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
Also Read: IND vs AUS: మెగ్ లానింగ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. సెమీస్‌కు ఆసీస్! ఇక టీమిండియాకు చావోరేవో!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook