RRR Latest Updates: రెచ్చిపోయిన ఫ్యాన్స్.. విజయవాడలో థియేటర్ అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం...

RRR Latest Updates : ఆర్ఆర్ఆర్ విడుదల వేళ థియేటర్లకు ప్రేక్షకులు క్యూ కట్టారు. కొన్నిచోట్ల లారీల్లో సైతం థియేటర్లకు తరలివెళ్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడక్కడ కొన్ని గొడవలు చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 25, 2022, 04:53 PM IST
  • ఆర్ఆర్ఆర్ థియేటర్ల వద్ద మాస్ జాతర
  • విజయవాడ అన్నపూర్ణ థియేటర్‌లో రెచ్చిపోయిన ఫ్యాన్స్
  • థియేటర్ అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం
RRR Latest Updates: రెచ్చిపోయిన ఫ్యాన్స్.. విజయవాడలో థియేటర్ అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం...

RRR Latest Updates : ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ మేనియానే కనిపిస్తోంది. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా ఆర్ఆర్ఆర్ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. అటు థియేటర్లలో ఫ్యాన్స్ హంగామా పీక్స్‌లో ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ తెరపై కనిపించిన ప్రతీసారి ఈలలు, కేరింతలతో ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే అక్కడక్కడా థియేటర్లలో కొన్ని సాంకేతిక కారణాలతో షోకి అంతరాయం ఏర్పడినప్పుడు ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంతో రెచ్చిపోతున్నారు. విజయవాడలోని అన్నపూర్ణ థియేటర్‌లో ఫ్యాన్స్ ఇలాగే రెచ్చిపోయారు.

ఆర్ఆర్ఆర్ మూవీ షో ప్రారంభమైన కొద్దిసేపటికి సాంకేతిక కారణాలతో అంతరాయం ఏర్పడింది. దీంతో ఆగ్రహించిన ఫ్యాన్స్ థియేటర్ అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. థియేటర్ మేనేజ్‌మెంట్‌తో గొడవకు దిగారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకుని ఫ్యాన్స్‌కి సర్ది చెప్పారు. దీంతో గొడవ సద్దుమణిగింది. అయితే ఫ్యాన్స్ అద్దాలు ధ్వంసం చేసిన సమయంలో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది.

ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ బ్లాక్ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఎప్పటిలాగే మాస్ ఆడియెన్స్‌ని మెప్పించే అంశాలతో రాజమౌళి మరోసారి మ్యాజిక్ చేశాడని అంటున్నారు. ముఖ్యంగా తారక్, చెర్రీ మధ్య వచ్చే సీన్స్ గూస్ బంప్స్ అని చెబుతున్నారు. ఇంటర్వెల్ ఎపిసోడ్‌తో పాటు క్లైమాక్స్‌ ఎపిసోడ్ అద్భుతంగా ఉందంటున్నారు. సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఇక రికార్డుల వేట ఖాయమంటున్నారు. ఇదివరకు బాహుబలి పేరిట ఉన్న రికార్డులన్నింటినీ ఆర్ఆర్ఆర్ బద్దలు కొడుతుందని ఫ్యాన్స్ ధీమాగా చెబుతున్నారు.

Also Read: Nitin Gadkari News: రానున్న రెండేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు భారీగా తగ్గుతాయి: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

Also Read: Stalin Accident Scheme: రోడ్ యాక్సిడెంట్ బాధితులకు సహాయం చేస్తే రూ.5 వేల బహుమానం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేయండి.

Trending News