RRR Trailer: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ బాగోలేదంట.. ట్విటర్‌లో దారుణంగా కామెంట్స్

RRR Hindi trailer reviews on twitter: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ గురించి కొంతమంది హిందీ ఆడియెన్స్, హిందీ సినిమాల గురించి మాట్లాడుకునే అక్కడి నెటిజెన్స్ ఏమనుకుంటున్నారు అనే సందేహాలు ఆర్ఆర్ఆర్ మూవీపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్న ఫ్యాన్స్‌ని (RRR fans about RRR trailer) వేధిస్తున్నాయి. ఇదే విషయమై సోషల్ మీడియాలో ప్రస్తుతం కొన్ని ట్వీట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ ట్రైలర్ హిందీ వెర్షన్‌పై కొంత మంది నెటిజెన్స్ తమ అసంతృప్తిని తీవ్రస్థాయిలో వెళ్లగక్కుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 9, 2021, 07:17 PM IST
  • RRR Hindi trailer పై కొంతమంది నెటిజెన్స్ అసంతృప్తి
  • అంచనాలకు తగినట్టుగా ఆర్ఆర్ఆర్ ట్రైలర్ లేదని వ్యాఖ్యలు
  • ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌లో లోపాలు వేలెత్తి చూపుతున్న హిందీ ఆడియెన్స్
RRR Trailer: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ బాగోలేదంట.. ట్విటర్‌లో దారుణంగా కామెంట్స్

RRR Hindi trailer reviews on twitter: ఆర్ఆర్ఆర్ మూవీ ట్రైలర్ కొంతమంది హిందీ ఆడియెన్స్‌కి నచ్చలేదా ? ఆర్ఆర్ఆర్ ట్రైలర్ గురించి కొంతమంది హిందీ ఆడియెన్స్, హిందీ సినిమాల గురించి మాట్లాడుకునే అక్కడి నెటిజెన్స్ ఏమనుకుంటున్నారు అనే సందేహాలు ఆర్ఆర్ఆర్ మూవీపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్న ఫ్యాన్స్‌ని (RRR fans about RRR trailer) వేధిస్తున్నాయి. ఇదే విషయమై సోషల్ మీడియాలో ప్రస్తుతం కొన్ని ట్వీట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ ట్రైలర్ హిందీ వెర్షన్‌పై కొంత మంది నెటిజెన్స్ తమ అసంతృప్తిని తీవ్రస్థాయిలో వెళ్లగక్కుతున్నారు. 

ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌ను హిందీలో చూసిన సత్య సంకేత్ అనే ఓ నెటిజెన్.. ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌పై బ్రీఫ్ రివ్యూ రాస్తూ (RRR Trailer Hindi review) ట్విటర్‌లో దారుణమైన కామెంట్స్ చేశాడు. ఆర్ఆర్ఆర్ మూవీ ఇండియన్ హిస్టరీలోనే ఓ గొప్ప సినిమాగా నిలుస్తుందని చిత్ర బృందం చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ.. ''ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ఇండియన్ హిస్టరీలో కచ్చితంగా బెస్ట్ ట్రైలర్ అనిపించుకోదు'' అని ట్వీట్ చేశాడు. బాహుబలి, మగధీర, కేజీఎఫ్ 2, ఈటిటి, ధూమ్ 3 లాంటి చిత్రాల ట్రైలర్లు, టీజర్లు ఆర్ఆర్ఆర్ మూవీ ట్రైలర్ కంటే గొప్పగా ఉన్నాయని సదరు ట్విటర్ యూజర్ (Hindi audience about RRR trailer) తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు.  

Also read : RRR trailer: ఆర్ఆర్ఆర్ హిందీ ట్రైలర్ లాంచింగ్‌లో NTR ఆసక్తికర వ్యాఖ్యలు.. ముంబైలో RRR team

ముఖ్యంగా హిందీ డబ్బింగ్‌ని డిస్లైక్ చేసినట్టు డిస్లైక్ సింబల్ ద్వారా చూపించడంతో పాటు ఇంగ్లీషులో వచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ (RRR Trailer BGM) కూడా బాగోలేదని అభిప్రాయపడ్డాడు. చిన్న చిన్న తప్పిదాలతో ఉన్న ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌ను (RRR Hindi trailer) వెరీగుడ్ ట్రైలర్ అని మాత్రమే చెప్పొచ్చు అని ఒక్క ముక్కలో తేల్చేశాడు.

విచిత్రం ఏంటంటే.. ఇదే ట్విటర్ యూజర్ అంతకంటే కొద్దిక్రితం చేసిన ట్వీట్స్‌లో ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌ని, దర్శకుడు రాజమౌళిని ఆకాశానికెత్తేశాడు. అంతకు ముందు చేసిన ట్వీట్స్ ఇదిగో ఇలా ఉన్నాయి.

RRR trailer launch live updates

Also read: RRR Trailer Response: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ కు సెలెబ్రిటీలు ఫిదా.. RRR Teamపై ప్రశంసలు

ఇదిలావుంటే, మరొక ట్విటర్ యూజర్ ఆర్ఆర్ఆర్ ట్రైలర్ గురించి స్పందిస్తూ.. దక్షిణాది చిత్రాల్లో వాహనాలు, విలన్లు లేదా హీరోలు గాల్లోకి ఎగరడం.. అది కూడా స్లో మోషన్‌లో చూపించడం పరిపాటి అయ్యిందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. 

అయితే బాహుబలి సినిమాతో ఇండియన్ సినిమా ప్రతిష్ట, మార్కెట్ రేంజ్ పెంచిన మన దర్శకధీరుడు, జక్కన్న గురించి తక్కువ చేసి మాట్లాడిన నెటిజెన్స్‌కి అక్కడే లెఫ్ట్ అంట్ రైట్ ఇచ్చుకున్న నెటిజెన్స్ కూడా లేకపోలేదు. వారేమంటున్నారో వారి ట్వీట్స్‌లోనే చూడండి. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News