Hollywood Critics Award: హాలీవుడ్‌ క్రిటిక్స్ అసోసియేషన్స్‌లో క్లీన్ స్వీప్.. ఆర్ఆర్ఆర్ హవా.. రామ్ చరణ్ క్రేజ్‌కు నిదర్శనమిదే!

4 Hollywood Critics Award For RRR: ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పుడు మరోసారి ఇంటర్నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది, హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డ్స్‌లో ఆర్ఆర్ఆర్ సినిమా దుమ్ములేపేస్తోంది. బెస్ట్ సాంగ్, బెస్ట్ యాక్షన్, బెస్ట్ ఇంటర్నేషన్ కేటగిరీల్లో అవార్డులు అందుకుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 25, 2023, 01:17 PM IST
  • హాలీవుడ్‌లో ఆర్ఆర్ఆర్ సత్తా
  • రామ్ చరణ్‌, ఆర్ఆర్ఆర్ సందడి
  • బెస్ట్ యాక్షన్, ఇంటర్నేషనల్ ఫిల్మ్‌గా ఆర్ఆర్ఆర్
Hollywood Critics Award: హాలీవుడ్‌ క్రిటిక్స్ అసోసియేషన్స్‌లో క్లీన్ స్వీప్.. ఆర్ఆర్ఆర్ హవా.. రామ్ చరణ్ క్రేజ్‌కు నిదర్శనమిదే!

Four Hollywood Critics Award For RRR: హాలీవుడ్ అడ్డాలో ఇప్పుడు మన హీరో,దర్శకుడు సందడి చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పుడు హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డుల్లో దుమ్ములేపేస్తోంది. బెస్ట్ యాక్షన్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్, బెస్ట్ సాంగ్ ఇలా చాలా కేటగిరిల్లో ఈ సినిమా క్లీన్ స్వీప్ చేసి అవార్డులు కొల్లగొట్టేసింది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఇచ్చే ఈ అవార్డులు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ వేడుకల్లో అవార్డులను ప్రజెంట్ చేసేందుకు రామ్ చరణ్‌కు ప్రత్యేక ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే.

ఆర్ఆర్ఆర్ సినిమాకు ఇప్పుడు నాలుగు కేటగిరీల్లో అవార్డు దక్కింది. బెస్ట్ స్టంట్స్, బెస్ట్ యాక్షన్, బెస్ట్ సాంగ్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీల్లో అవార్డులు వచ్చాయి. ఇక బెస్ట్ స్టంట్స్ విషయంలో అవార్డు తీసుకున్న రాజమౌళి.. ఆ అవార్డును స్టంట్ మాస్టర్లందరికీ అంకితం చేశారు. సినీ ప్రపంచంలో కష్టపడే యాక్షన్ కొరియోగ్రఫర్లందరికీ అంకితమిస్తున్నాను అని అన్నాడు రాజమౌళి.

 

ఇక రామ్ చరణ్‌ అయితే ఈ వేడుకల్లో అవార్డు అందించేందుకు ముందుకు వచ్చాడు. బెస్ట్ వాయిస్ ఓవర్ మోషన్ క్యాప్చర్ కేటగిరీ అవార్డును రామ్ చరణ్‌ అందించాడు. ఇక ఈ వేడుకలో రామ్ చరణ్‌ పేరుని సరిగ్గా పలకలేపోయిన ఓ నటి స్టేజ్ మీదే క్షమాపణలు చెప్పింది. రామ్ అంటూ ముద్దుగా పలికిన నటి.. చరణ్ అని ఆ తరువాత యాడ్ చేసింది. మొత్తానికి రామ్ చరణ్‌ మాత్రం ఇప్పుడు అక్కడి ఈవెంట్లో హాట్ టాపిక్‌గా మారాడు.

హాలీవుడ్ మేకర్లు సైతం రామ్ చరణ్‌తో చర్చలు జరుపుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడున్న కమిట్మెంట్లను పూర్తి చేసుకుని హాలీవుడ్‌లోనూ ప్రాజెక్టులు చేయాలని రామ్ చరణ్‌ భావిస్తున్నట్టుగా తన మాటలతో అర్థమైంది. గుడ్ మార్నింగ్ అమెరికా, ఏబీసీ మీడియాతో రామ్ చరణ్ చెప్పిన విషయాలన్నీ ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇక నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వస్తుందనే ఆశాభావాన్ని రామ్ చరణ్‌ వ్యక్తం చేశాడు.

Also Read:  Medical Student Preethi Suicide: ప్రీతి చనిపోయిందా..? అడ్డంగా బుక్కైన పూనమ్ కౌర్..నెటిజన్లు ఫైర్

Also Read: Anchor Rashmi Gautam : రష్మీని కుక్కను కొట్టినట్టు కొట్టాలన్న నెటిజన్‌.. యాంకర్ జబర్దస్త్ రిప్లై

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News