Rithu Chowdary to Vacate her House: తెలుగు ప్రేక్షకులు ఎవరికీ రీతు చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా కనిపించకపోయినా ఈ బ్యూటీ తెలుగు వారందరికీ పరిచయమే. జీ తెలుగులో ప్రసారమయ్యే సరిగమపలో సింగర్ యశస్విని హగ్ చేసుకుని ఒక్క సారిగా హాట్ టాపిక్ అయింది రీతూ చౌదరి. ఆ తర్వాత జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి లేడీ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామకి ఇప్పుడు జబర్దస్త్ రీతూ చౌదరి అనే పేరు వచ్చేసింది.
నిజానికి జబర్దస్త్ రీతూ చౌదరి అనేకంటే జీ తెలుగు సీరియల్స్ లో నటించిన రీతు చౌదరి అన్నా చాలా మంది గుర్తుపడతారు. ఒకరకంగా బుల్లితెరపై స్టార్ క్రేజ్ సంపాదించిన ఈ భామ జబర్దస్త్ కమెడియన్ గా కూడా మెప్పిస్తోంది. అయితే తనదైన అందంతో పాటు హాట్ నెస్ ఆరబోస్తూ కామెడీ పండించడంలో ముందుగా ఈ భామ ఎందుకో తడబడింది. డైలాగులు కూడా సరిగా చెప్పలేక విమర్శల పాలైనా ఇప్పుడిప్పుడే సెట్ అయి బాగానే సంపాదిస్తోంది. ఇక తనదైన అందంతో సోషల్ మీడియాలో అలరిస్తున్న ఈ భామ హాట్ హాట్ వీడియోలు రీల్స్ చేస్తూ టీవీ షోలు, షార్ట్ ఫిలిమ్స్, యాడ్స్, ఇంస్టాగ్రామ్ యాడ్స్ చేస్తూ రెండు చేతులా బాగానే సంపాదిస్తోంది. నిజానికి ఈ మధ్యనే తండ్రిని కోల్పోయిన ఈ భామ తర్వాత నెగెటివిటీకి కూడా గురై ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆమె తండ్రి ఈ మధ్యనే హార్ట్ ఎటాక్ తో చనిపోయారు. చిన్న వయసే కావడం చిన్నప్పటి నుంచి తనను బాగా గారాబంగా పెంచడంతో తండ్రి మరణం నుంచి ఈ భామ బయటపడలేక పోతుంది.
Also Read: Samantha Deleted Story: సోషల్ మీడియా పోస్ట్ డిలీట్ చేసిన సమంత.. పాపం షాకిచ్చారుగా!
ఈ క్రమంలోనే ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అదేమిటంటే తన తండ్రితో కలిసి ఉన్నప్పుడు నివసించిన ఇంటిని ఖాళీ చేయాలని నిర్ణయం తీసుకుంది. తండ్రి జ్ఞాపకాల నుంచి దూరంగా ఉండాలంటే ఈ ఇంటి నుంచి దూరంగా ఉండాలని ఉద్దేశంతో ఆ అద్దె ఇంటిని కాళీ చేస్తున్నట్లు రీతూ చౌదరి వెల్లడించింది. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానల్ లో ఒక వీడియో రిలీజ్ చేసింది. నాన్న తనకు గుర్తుగా ఇచ్చిన దిండు గురించి తన గది విశేషాలు గురించి కూడా ఆమె సదరు వీడియోలో పంచుకుంది. అదే ఫ్లాట్లో ఉంటే పదే పదే తండ్రి గుర్తొస్తున్నారని అందువల్ల ఏం చేయలేకపోతున్నానని తండ్రి దూరమైన బాధ తనను వెంటాడుతోందని రీతు చౌదరి ఆవేదన వ్యక్తం చేస్తోంది.
అందుకే ఇల్లు ఖాళీ చేస్తున్నానని చెప్పుకొచ్చింది. అంతేకాదు తన తండ్రి ధరించిన షర్ట్స్ కూడా దాచుకున్న రీతు చౌదరి వాటిని పట్టుకుని కన్నీళ్లు పెట్టుకోవడం కూడా వీడియోలో కనిపిస్తోంది. తన తండ్రితో కలిసి తాను ఆడుకునేదాన్ని, ఇద్దరం కొట్టుకునే వాళ్ళమని, కబుర్లు చెప్పుకునే వాళ్ళమని ఈ ఇంటితో తమకు ఎన్నో మెమరీస్ ఉండిపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. అక్కడే ఉంటే ఆయనను మరిచిపోలేకపోతున్నానని లైఫ్ లో ముందుకు సాగాలంటే గతాన్ని మరిచిపోవాలని ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చింది.
అందుకే తండ్రి జ్ఞాపకాలకు దూరం అవ్వాలంటే ఈ ఇంటికి దూరం అవ్వాలని నిర్ణయం తీసుకున్నామని అందుకే ఈ అద్దె ఫ్లాట్ ని ఖాళీ చేస్తున్నామని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఈ క్రమంలో ఒక మరో కీలకమైన నిర్ణయం కూడా తీసుకుంది. రీతూ చౌదరి. అదేమిటంటే తాను పుట్టినప్పటినుంచి వేసుకున్న దుస్తులను విరాళంగా ఇవ్వాలనుకుని నిర్ణయం తీసుకుందట. నిజానికి తనకు డ్రస్సుల పిచ్చని ఏ డ్రస్ అయినా రెండు మూడు సార్లు మించి ధరించినని చెప్పుకొచ్చింది. అందుకే అవి ఇప్పటికీ చాలా కొత్తగా బాగుంటాయని ఆమె చెప్పుకొచ్చింది. అవసరంలో ఉన్న వారికి, అనాధ శరణాలయాలకు తన దుస్తులు దానం చేయాలని ఆమె భావిస్తున్నట్లుగా వెల్లడించింది.
Also Read: Simhadri 4K: సింహాద్రి రీ రిలీజ్.. రంగంలోకి దిల్ రాజు.. మామూలు మాస్ కాదుగా ఇది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook