Kantara One Week Collections : కాంతారా సినిమా రోజురోజుకూ జనాల నోళ్లలో నానుతూ ఉంది. ఆడియెన్స్ మైండ్ నుంచి కాంతారా వెళ్లడం లేదు. వు.. వూ.. అంటూ అందరి మైండ్‌లో రిషబ్ శెట్టి అరుపులే వినిపిస్తున్నాయి. రిషభ్ శెట్టి నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. కాంట్రవర్సీ నటి, బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ అయితే.. ఆస్కార్ ఎంట్రీకి ఇండియా నుంచి పంపించాల్సిందే అన్నట్టుగా పోస్ట్ వేసింది. అలా రిషభ్ శెట్టి తన యాక్టింగ్‌తో అందరినీ మెప్పించేశాడు.
కన్నడలో ఇప్పటికే వంద కోట్లు కొల్లగొట్టేసింది. సెప్టెంబర్ 30న ఈ మూవీ కన్నడలో విడుదలైంది. కేవలం రెండు వారాల్లోనే ఈ సినిమా అక్కడ వంద కోట్లను కొల్లగొట్టేసింది. మౌత్ టాక్ పెరగడంతో ఈ సినిమాను అన్ని భాషల్లోకి డబ్ చేయాలనే నినాదం ఎక్కువైంది. దీంతో అక్టోబర్ 15న ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ రేంజులో డబ్ చేసి వదిలారు. దీంతో కలెక్షన్లు మరింతగా ఊపందుకున్నాయి. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో కాంతారా సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
తెలుగులో అయితే రెండు కోట్ల వరకు బిజినెస్ చేసిన ఈ చిత్రం.. మొదటి రోజే బ్రేక్ ఈవెన్ దాటేసింది. ఫస్ట్ రోజునే ఈ సినిమాకు దాదాపు రెండున్నర కోట్ల షేర్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ వారం రోజుల్లోనే ఐదు రెట్ల లాభాలను చవి చూసింది. ఈ సినిమాకు వారం రోజుల్లో ఇరవై కోట్లకు పైగా గ్రాస్.. పది కోట్లకు పైగా షేర్ వచ్చినట్టు తెలుస్తోంది. రోజు వారిగా ఎంత కలెక్ట్ చేసిందో ఓ సారి చూద్దాం.
మొదటి రోజు 2.10 కోట్లు, రెండో రోజు 2.80, మూడో రోజు 1.9, నాలుగో రోజు 1.45, ఐదో రోజు 1.36, ఆరో రోజు 1.11, ఏడో రోజు 65 లక్షలు వసూల్ చేసిందని తెలుస్తోంది. అలా మొత్తంగా ఈ చిత్రం వారం రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 11.37 కోట్ల షేర్.. 21.15 కోట్ల గ్రాస్ సాధించినట్టు సమాచారం అందుతోంది. ఈ లెక్కన ఈ సినిమా అన్ని భాషల్లో అన్ని ఏరియాల్లో చూసుకుంటే దాదాపు రెండొందల కోట్ల వరకు కొల్లగొట్టినట్టు టాక్.
(గమనిక : ఈ సమాచారం వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా సేకరించినది, వీటిని జీ తెలుగు న్యూస్ ధృవీకరించడం లేదు.)
Also Read : Sankranthi 2022 Box Office : సంక్రాంతి వార్.. బాలయ్య రాకతో తారుమారు.. చిరు నెగ్గేనా?
Also Read : Vishnu Manchu Ginna Collections : జిన్నా పరిస్థితి మరీ దారుణంగా.. 50 షోలకు 49 టికెట్లు తెగాయా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook