బాలీవుడ్ నటుడు సుశాంత్ సింహ్ మరణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును పాట్నా నుంచి ముంబాయికి బదిలీ చేయాలంటూ సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి పిటీషన్ దాఖలు చేయడం చర్చనీయాంశమైంది.
ఆత్మహత్యకు పాల్పడ్డ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వ్యవహారం ఇంకా కొలిక్కి రావడం లేదు. ఎన్నో అనుమానాలు..మరెన్నో మలుపులు. ఇంకెన్నో పాత్రలు తెరపైకి. కొడుకు మరణానికి కారణం అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి అని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు నేపధ్యంలో కేసులో రియా పాత్రపై అనుమానాలు రేకెత్తాయి. ఇదే విషయమై ముంబాయి, పాట్నా పోలీసులకు మధ్య అభిప్రాయబేధాలు తలెత్తాయి. అదే సమయంలో రియా చక్రవర్తి తాజాగా వేసిన పిటీషన్ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఈ కేసును పాట్నానుంచి ముంబాయికు బదిలీ చేయాలని ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మూడ్రోజుల్లోగా కేసుకు సంబంధించిన ప్రతివాదులంతా సమాధానం చెప్పాలని కోర్టు కోరింది. ఈ పిటీషన్ పై విచారణను వారం రోజులకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. సుశాంత్ కేసును సీబీఐకు అప్పగించాలన్న బీహార్ ప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్రం అంగీకరించిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు విన్నవించారు.
Rhea Chakraborty's petition seeking direction for transfer of investigation from Patna to Mumbai in #SushanthSinghRajput death case: Supreme Court directs all parties to file their respective replies within three days. Further hearing in the matter to be held after a week. https://t.co/u2FC8k3Vid
— ANI (@ANI) August 5, 2020
మరోవైపు బీహార్ కు చెందిన ఐపీఎస్ అధికారి వినయ్ తివారీను క్వారెంటైన్ కు పంపడమనేది సాక్ష్యాల్నిచెరపడానికేనని సుశాంత్ తండ్రి తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. పాట్నా పోలీసులకు సహకరించాల్సిందిగా ముంబాయి పోలీసుల్ని ఆదేశించాలని సుప్రీంను కోరారు. Also read: CBI probe: సుశాంత్ మృతి కేసులో మరో కీలక మలుపు