RGV check bounce case: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మారిన రామ్ గోపాల్ వర్మ.. ఎక్కువగా అడల్ట్ చిత్రాలు చేసి యువతను బాగా ఆకట్టుకున్నారు. అంతేకాదు ఈయన సినిమాల ద్వారా ఎంతో మంది మొరుగున పడ్డ హీరోయిన్స్ వెలుగులోకి వచ్చారు అని చెప్పవచ్చు. వర్మ డైరెక్షన్లో ఒక సినిమా చేశారంటే చాలు, వారి కెరియర్ అమాంతం మారిపోతుంది అనడంలో సందేహం లేదు.
ఇదిలా ఉండగా.. రాంగోపాల్ వర్మ గత కొంతకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. గత ఏడాది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ ల ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పలు కేసులు ఎదుర్కొన్న ఈయన.. ఇప్పుడు చెక్ బౌన్స్ కేసులో మరో ఇబ్బందుల్లో పడినట్లు తెలుస్తోంది.
ఇక ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఆరేళ్ల క్రిందట జరిగిన ఒక సంఘటన ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంది. నాటి కేసులో ముంబైలోని అంతేరి మెజిస్ట్రేట్ కోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆర్జీవిని దోషిగా తేలుస్తూ తీర్పు ఇచ్చింది. మూడు నెలల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
2018లో ముంబైలో చెక్ బౌన్స్ కేసు రాంగోపాల్ వర్మ పై నమోదయింది. అప్పట్లో మహేష్ చంద్ర మిశ్రా అనే వ్యక్తి శ్రీ అనే కంపెనీ పేరుతో రామ్ గోపాల్ వర్మ పై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆరేళ్లుగా ఈ కేసు విచారణ జరుగుతూనే ఉంది. ఎన్నిసార్లు విచారణకు రావాలి అని నోటీసులు పంపినా.. కోర్టుకు వెళ్లకుండా తప్పించుకు తిరిగాడట వర్మ.
దీంతో ఆగ్రహించిన కోర్టు ఆర్జీవి పై సీరియస్ అయింది. అతనిపై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేస్తూ వచ్చే మూడు నెలల్లో ఫిర్యాదుదారుడికి రూ.3.72 లక్షల పరిహారం చెల్లించాలని, లేనియెడల మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు తీర్పు ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం వర్మ కు సంబంధించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి వర్మ ఫిర్యాదుదారుడికి డబ్బు చెల్లిస్తాడా లేక జైలుకు వెళ్తాడా అన్న ప్రశ్నలతో సోషల్ మీడియాలో ఒక వైరల్ చేస్తున్నారు.
Also Read: Body Parts Cooked: ఘోరాతి ఘోరం.. భార్యను హత్య చేసి కుక్కర్‌లో ఉడికించిన భర్త
Also Read: Mahakumbh Mela 2025 Yogi: కుంభమేళాలో సీఎం యోగి మంత్రుల పుణ్య స్నానాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter