RGV Controversial Comments @ Nagarjuna University: ఒకప్పుడు ట్రెండ్ సెట్టర్ గా ఉన్న రాంగోపాల్ వర్మ తర్వాతి కాలంలో అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వివాదాస్పద సినిమాలు చేస్తూ ప్రేక్షకులు తనను మర్చిపోకుండా చేసుకుంటున్నాడు. తాజాగా రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తినండి, తాగండి, సెక్స్ చేయండి అంటూ విద్యార్థులకు ఆయన సూచనలు చేశారు. హ్యాపీగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేసుకోండి అని సలహాలు ఇవ్వాల్సిన చోట తినండి, తాగండి, సెక్స్ చేయండి అంటూ ఆయన సలహాలు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.
అసలు విషయం ఏమిటంటే గుంటూరులో ఉన్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అకాడమీ ఎగ్జిబిషన్‌కు రాంగోపాల్ వర్మను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్ళిన రాంగోపాల్ వర్మ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అది ఏమిటంటే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సవాలక్ష ఆంక్షలు పెడతారు. అది మంచిది కాదు, ఇది మంచిది కాదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు అని చెబుతూ ఉంటారని కానీ అవేమీ పట్టించుకోకండి మీకు ఇష్టం వచ్చినట్లు జీవించండి అంటూ రామ్ గోపాల్ వర్మ సలహా ఇచ్చారు. ఇక తన అనుభవం చెబుతున్నానంటూ ఫస్ట్ పెంచి స్టూడెంట్స్ ఎప్పటికీ పైకి రారని నాలాంటి లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ పైకి వస్తారని రాంగోపాల్ వర్మ చెప్పుకొచ్చారు.
ఇక హార్డ్ వర్క్ చేయొద్దు స్మార్ట్ వర్క్ చేయాలి అని పేర్కొన్న ఆయన నచ్చింది తినండి, తాగండి, సెక్స్ చేయండి అంటూ సూచనలు చేశారు. ఎందుకంటే ఒకవేళ చచ్చి పైకి పోయిన తర్వాత రంభ, ఊర్వశి ఉంటారు అక్కడ ఎంజాయ్ చేయవచ్చు అని అందరూ భావిస్తూ ఉంటారు. కానీ అక్కడ అలాంటి వాళ్ళు లేకపోతే పరిస్థితి ఏమిటి..? అందుకే ఆలస్యం చేయకుండా ఇప్పటినుంచి ఎంజాయ్ చేయడం మొదలుపెట్టండి అని పేర్కొన్నారు. ఇక ఏదో ఒక వైరస్ వచ్చి సమాజంలో ఉన్న మగజాతంతా నశించి పోవాలని నేను ఒక్కడినే బ్రతికి అప్పుడు ఎంజాయ్ చేయాలని కల ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
ఇక ఈ సందర్భంగా విద్యార్థులు గతంలో జిఎస్టి అనే ఒక బోల్డ్ ఫిలిం చేశారు కదా ఇప్పుడు దాని సీక్వెల్ ఎప్పుడు చేస్తారు అని అడిగితే మీ దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి కదా మీరే తీసుకోవచ్చు అంటూ నోటి దురద వ్యాఖ్యలు చేశారు రామ్ గోపాల్ వర్మ. అలాగే నాకోసమే నేను బ్రతుకుతా , నాకు నచ్చినట్లే బ్రతుకుతానని పేర్కొన్న ఆయన నేను పోయిన తర్వాత ఈ ప్రపంచం ఏం ఐపోయినా నేను బాధ పడనని అన్నారు. ఎక్కడో రంభ ఊర్వశి , మేనక లు ఉంటారని నమ్మి ఇక్కడి సుఖాలు వదులుకోనని అన్నారు. మనకి ఎక్కడ సుఖం ఉంటదో పెద్ద వాళ్ళు వాటిని చేయొద్దంటారు, ఆంక్షలు పెడతారని పేర్కొన్న ఆయన నేను ఆ చాన్స్ తీసుకోను , అన్ని సుఖాలు ఇక్కడే అనుభవిస్తానని, చేతిలో ఉన్నప్పుడే అన్ని అనుభవించాలని అన్నారు.
Also Read: Gopireddy Challenges Balakrishna:మనిషే కదా..మూడో కన్ను ఎక్కడిది..బాలకృష్ణకు ఎమ్మెల్యే సవాల్!
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook