Renu Desai: యానిమల్ సినిమాని మిస్ అవ్వకుండా చూడమన్నా రేణు దేశాయ్.. పోస్ట్ వైరల్

Animal: డిసెంబర్ 1న విడుదలైన యానిమల్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రంలో ఉన్న బోల్డ్ కంటెంట్ గురించి కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ యానిమల్ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 6, 2023, 05:27 PM IST
Renu Desai: యానిమల్ సినిమాని మిస్ అవ్వకుండా చూడమన్నా రేణు దేశాయ్.. పోస్ట్ వైరల్

Renu Desai Instagram Post: అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ మరోసారి తన మార్కుతో తీసిన సినిమా యానిమల్. అర్జున్ రెడ్డిలో ప్రీతి పైన ఎంత ప్రేమ చూపించారో ఈ సినిమాలో హీరో తన తండ్రి పైన అంత ప్రేమ చూపిస్తారు. అంతేకాదు హీరో యాటిట్యూట్ అలానే కొన్ని బోల్డ్ సీన్స్ కూడా అర్జున్ రెడ్డిలో ఏ రేంజ్ లో చూపించారో అంతకన్నా కొంచెం ఎక్కువ రేంజ్ లోనే యానిమల్ లో చూపించారు సందీప్ రెడ్డి. అందుకే అర్జున్ రెడ్డి సినిమా లాగానే యానిమల్ సినిమా కూడా సోషల్ మీడియాలో చాలా చర్చలకు దారితీస్తోంది. కొంతమంది ఈ సినిమా చాలా బాగుంది అని ప్రశంసలు కురిపిస్తూ ఉంటే మరి కొంతమంది మాత్రం అసలు ఈ సినిమాలో దర్శకుడు ఏమి చూపియ్యాలనుకున్నారు అని విమర్శిస్తున్నారు.

అయితే ఈ చిత్రం నచ్చిన సెలబ్రిటీస్ మాత్రం తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా యానిమల్ సినిమా చూసి మరి దానిపైన రివ్యూ వెయ్యడం అందరి దృష్టిని ఆకట్టుకుంది.

రేణు దేశాయ్ తన ఇంస్టాగ్రామ్ లో యానిమల్ సినిమాలోని రష్మిక మందాన పోస్టర్ ని షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకుంది.. ‘నిన్న యానిమల్ సినిమాను చూశాను.. నేను ఈ సినిమాతో ప్రేమలో పడిపోయాను.. కానీ దయచేసి వీక్ హార్ట్ ఉన్న వాళ్లు ఈ సినిమాను చూడొద్దు.. ఇందులో బ్లడీ యాక్షన్ సీక్వెన్స్, వయలెన్స్ పార్ట్ చాలానే ఉంది.. మీరు కొత్తగా అనుభూతి చెందాలంటే.. కొత్తదనం చూడాలనుకుంటే ఈ సినిమాను కచ్చితంగా మిస్ అవ్వకండి థియేటర్లో చూడాల్సిన సినిమా..’ అని రేణూ దేశాయ్ తన రివ్యూ చెబుతూ పోస్ట్ వేశారు. 

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by renu desai (@renuudesai)

 

కాగా రేణు దేశాయ్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. ఇక రేణూ దేశాయ్ చివరగా రవితేజ హీరోగా చేసిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నటించింది. హేమలతా లవణం పాత్రలో రేణూ దేశాయ్ ఎంతో హుందాగా ఆ సినిమాలో కనిపించింది. మరి రేణు మళ్ళీ ఏదైనా తెలుగు సినిమాకి ఓకే చెబుతుందా లేదా తెలియాలి అంటే మరికొద్ది రోజులు వేచి చూడాలి.

Also read: Telangana CM Oath: రేపు రేవంత్ కాకుండా మరో ఆరుగురికే ఛాన్స్, , అసెంబ్లీ తరువాతే పూర్తి స్థాయి కేబినెట్

Also read: Rain Alert: ఏపీలో తొలగని వర్షముప్పు, ఆ 5 జిల్లాలకు ఆరెంజ్ ఆలర్ట్ జారీ

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News