Pawan Kalyan: అతను నాలాగా ప్రేమ, కేరింగ్ చూపించడు..మరోసారి పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ అసహనం

Renu Desai: పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడాకులు తీసుకొని ఎన్నో సంవత్సరాలు కావస్తున్న.. పవన్ అభిమానులు మాత్రం ఇంకా రేణు దేశాయిని.. పవన్ కళ్యాణ్ భార్య లానే ట్రీట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అయితే ఇందువలన రేణు దేశాయ్ పలుమార్లు తన సోషల్ మీడియా అకౌంట్లో అసహనం వ్యక్తం చేయాల్సి వచ్చింది..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 18, 2024, 03:02 PM IST
Pawan Kalyan: అతను నాలాగా ప్రేమ, కేరింగ్ చూపించడు..మరోసారి పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ అసహనం

Renu Desai Tweet: బద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ రేణు దేశాయ్. కొద్దిరోజుల తరువాత అదే సినిమాలో హీరోగా చేసిన పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకుంది. జానీ సినిమాలో కూడా కలిసి నటించిన వీరిద్దరూ మొదట కొన్ని రోజులు సహజీవనం చేశారు. అప్పటికే మొదటి భార్యతో విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్.. రేణు దేశాయిని రెండవ వివాహం చేసుకున్నారు. అక్కడి వరకు కథ బాగానే ఉన్నా.. ఆ తరువాత మాత్రం పలు కారణాలవల్ల వీరిద్దరూ విడిపోవాల్సి వచ్చింది. అయితే వీరిద్దరూ విడిపోయాక పవన్ కళ్యాణ్ పిల్లలు అకిరా, ఆధ్యా ఇద్దరు కూడా రేణు దేశాయ్ దగ్గరే ఉన్నారు. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి చేసుకొని ప్రస్తుతం తన మూడో భార్యతో ఉంటున్నారు.

పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ వీరిద్దరి వివాహ జీవితం గురించి బయట ఎక్కడా పెద్దగా చర్చించకపోయినా.. వారి అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వేస్తూనే ఉంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పటికీ రేణు దేశాయిని తమ వదినలనే ఫీల్ అవుతారు. కానీ కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రవర్తించే తీరు మాత్రం రేణు దేశాయ్కి పలుమార్లు కోపం తెచ్చేలా చేసింది.

అసలు విషయానికి వస్తే ఈ మధ్య రేణు దేశాయ్ కుక్కలు, పిల్లులు, పలు జంతువుల కోసం సర్వీస్ చేస్తుంది. యానిమల్స్ ఎన్జీవోలకు సహకారం అందిస్తుంది. కాగా ఇదే విషయానికి సంబంధించి ఈ మధ్య పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు.. రేణు దేశాయ్ షేర్ చేసిన పోస్ట్ కి రిప్లై పెడుతూ.. వాళ్ళు కూడా మా అన్నయ్య పవన్ కళ్యాణ్ లాగా గోల్డెన్ హార్ట్ అని కామెంట్ చేశాడు. దీనికి వెంటనే రేణు దేశాయ్ రిప్లై ఇచ్చింది.

ఎందుకు ప్రతిసారి నా పోస్టుల కింద నా ఎక్స్ హస్బెండ్ తో కంపేర్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పటికే ఇలాంటి వాళ్ళని చాలామందిని నేను బ్లాక్ చేశాను నేను సింగిల్ గా యానిమల్ సర్వీస్ చేస్తున్నాను.‌ నాకు పది సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి ఈ పనులు చేస్తున్నాను. వీటితో నా ఎక్స్ హస్బెండ్ కి సంబంధం లేదు. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇలా ప్రతి పోస్ట్ కి పవన్ కళ్యాణ్ తో కంపేర్ చేస్తూ కామెంట్స్ పెట్టడం ఆపండి. అతను నాలాగా యానిమల్స్ పై ప్రేమ, కేరింగ్ చూపించడు అని కామెంట్ చేసింది.

అంతేకాకుండా రేణు దేశాయ్ మళ్ళీ ఆ కామెంట్ ని స్క్రీన్ షాట్ తీసి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. ‘నాకు ఇలాంటి రిప్లైలు చాలా కోపాన్ని, బాధని తెప్పిస్తాయి. ఎన్ని సంవత్సరాలైనా నా సొంతంగా నేనేం చేసినా దాన్ని నా ఎక్స్ హస్బెండ్ తో కంపేర్ చేస్తారు. నాకు పవన్ కళ్యాణ్ తో ఎలాంటి పర్సనల్ ప్రాబ్లం లేదు కానీ అతని అభిమానులు మాత్రం నన్ను నన్నుగా వదిలేస్తే మంచిది అని నా అభిప్రాయం’ అని చెప్పింది. దీంతో రేణు దేశాయ్ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Also read: Dice Snakes: ఆస్కార్ లెవల్ పర్ఫామెన్స్.. చచ్చిపోయినట్లు నటిస్తున్న పాములు.. కారణం ఏంటో తెలుసా..?

Also read: IPL 2024 RCB vs CSK: ఆర్సీబీ వర్సెస్ సీఎస్కే, ఇరు జట్ల బలాలు, పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ 11 అంచనాలు ఇలా

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News