Renu Desai - Aadya : ఆద్య కోరిక అదే.. మంచి పని అయిందన్నట్టుగా నవ్వేస్తున్న రేణూ దేశాయ్

Renu Desai in Gulmarg న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్‌లో భాగంగా ఆద్య మంచు కొండల్లో విహరించాలని కోరిందట. అందుకే ఆద్యను రేణూ దేశాయ్ కాశ్మీర్ లోయలకు తీసుకెళ్లింది. అక్కడ ఇలా మంచులో ఆడించేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 8, 2023, 02:17 PM IST
  • కాశ్మీర్ లోయలో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్
  • ఆద్య కోరికను తీర్చిన రేణూ దేశాయ్
  • చలికి గజగజ వణికిపోతోన్న రేణూ దేశాయ్
Renu Desai - Aadya : ఆద్య కోరిక అదే.. మంచి పని అయిందన్నట్టుగా నవ్వేస్తున్న రేణూ దేశాయ్

Aadya New Year Celebrations రేణూ దేశాయ్, ఆద్య ప్రస్తుతం మంచు కొండల్లో విహరిస్తున్నారు. కాశ్మీర్, గుల్మర్గ్ ప్రాంతాల్లో ఆద్య, రేణూ దేశాయ్ ఎంజాయ్ చేస్తున్నారు. చార్లీ సినిమాలో చార్లీ ఎంజాయ్ చేసినట్టుగా ఆద్య అక్కడి మంచు కొండల్లో పడి దొర్లేసింది. ఇక ఆద్య అల్లరిని రేణూ దేశాయ్ తన కెమెరాలో బంధించేసింది. అయితే ఇలా ఎక్కువగా మంచు కొండల్లో ఆడటంతో ఈ చలికి దెబ్బకు వణుకు వచ్చేసింది. కోల్డ్ అయిందని చివరకు ఇలా అయిపోయిందంటూ ఆద్యను చూపిస్తూ రేణూ దేశాయ్ నవ్వేసింది.

ఒళ్లంతా దుప్పట్లు కప్పుకున్నట్టుగా ఆద్య కనిపిస్తోంది. కేవలం ఆమె కళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇక ఆద్యను అలా చూపిస్తూ మంచి పని అయిందన్నట్టుగా రేణూ దేశాయ్ నవ్వేసింది. కొత్త ఏడాదిని మంచులో సెలెబ్రేట్ చేసుకోవాలని అడిగావ్ కదా?.. ఇప్పుడు మంచిగా అయిందా? అన్నట్టుగా రేణూ దేశాయ్ నవ్వుతూ ఆద్య వీడియోను షేర్ చేసింది. కళ్లు మాట్లాడతాయ్ అని చెప్పడానికి ఇదే ఉదాహరణ అంటూ ఆద్య ఎక్స్‌ప్రెషన్స్‌ను రేణూదేశాయ్ క్యాప్చర్ చేసింది.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by renu desai (@renuudesai)

రేణూ దేశాయ్ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వెకేషనలో అకిరా నందన్ మాత్రం కనిపించడం లేదు.అకిరా ఇక్కడే హైద్రాబాద్‌లోనే ఉన్నాడు. కాశ్మీర్‌కు రేణూ దేశాయ్ బయల్దేరిన రోజునే.. అకిరా ఖుషి రీ రిలీజ్ థియేటర్లో సందడి చేశాడు. అభిమానులతో కలిసి ఖుషి సినిమాను అకిరా వీక్షించాడు.

రేణూ దేశాయ్ ప్రస్తుతం రవితేజ హీరోగా వస్తోన్న టైగర్ నాగేశ్వరరావు సినిమాతో బిజీగా ఉంది. హేమలతా లవణం అనే పాత్రలో రేణూ దేశాయ్ కనిపిస్తుంది. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన 
షూటింగ్‌లో రేణూ దేశాయ్ పాల్గొంది. ఇది కాకుండా ఆద్య అనే ఓ వెబ్ సిరీస్‌ను కూడా కరోనా టైంలో అనౌన్స్ చేసింది. కానీ ఇంత వరకు మళ్లీ ఓ అప్డేట్ అంటూ ఇవ్వలేదు. తన రైతు సినిమాను ఈ ఏడాది అయినా రేణూ దేశాయ్ మొదలుపెడుతుందా? లేదా? అన్నది చూడాలి.

Also Read: Thala Ajith Family : అజిత్ ఫ్యామిలీ ఫోటోలు.. ఆయన కూతురు ఎలా ఉందో చూశారా?

Also Read: Roja Satires on Mega Family : ఏ ఒక్కరికీ సాయం చేయలేదట.. అందుకే ముగ్గుర్నీ ఓడించారట.. మంత్రి రోజా సంచలన కామెంట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News