రవితేజ నెక్స్ట్ సినిమా పేరు 'నేల టికెట్'

'రాజా ది గ్రేట్' సినిమాతో మంచి జోష్ మీదున్న మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం 'రారండోయ్ వేడుక చూద్దాం' డైరెక్టర్ కళ్యాణక్రిష్ణ కురసాల దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారని సమాచారం.  

Last Updated : Dec 24, 2017, 07:03 PM IST
రవితేజ నెక్స్ట్ సినిమా పేరు 'నేల టికెట్'

'రాజా ది గ్రేట్' సినిమాతో మంచి జోష్ మీదున్న మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం 'రారండోయ్ వేడుక చూద్దాం' డైరెక్టర్ కళ్యాణక్రిష్ణ కురసాల దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారని సమాచారం.  అయితే ఈ సినిమాకి 'నేల టికెట్' అనే టైటిల్‌ని నిర్మాతలు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. జనవరి 5వ తేదీన ఈ చిత్రాన్ని ప్రారంభిస్తారని.. ఓ ప్రముఖ హీరోయిన్ ఈ చిత్రంలో కథానాయికగా నటించే అవకాశముందని టాక్.

ఎస్సార్టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానరుపై నిర్మితమయ్యే ఈ చిత్రం ప్రస్తుతం కథాచర్చల్లో ఉంది. రవితేజ ఇప్పటికే నటించిన 'టచ్ చేసి చూడు' చిత్రం పోస్టు ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. అలాగే ఈ సినిమా రిలీజ్ అయ్యాక శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందే చిత్రానికి కూడా సైన్ చేశారు రవితేజ. ఈ క్రమంలో 'నేల టికెట్' చిత్రం ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే. 

Trending News