Ravi Teja: ఓవర్ చెయ్యకు.. హరీష్ శంకర్ కు షాకింగ్ రిప్లై ఇచ్చిన రవితేజ

Ravi Teja Next Movie: మాస్ మహారాజా రవితేజ.. ప్రస్తుతం డైరెక్టర్ హరీష్ శంకర్ తో ఒక సినిమా.. చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన.. అప్డేట్లను ఇస్తున్న హరీష్ శంకర్ కి.. రవితేజ షాకింగ్ రిప్లై ఇచ్చారు. ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 23, 2024, 02:49 PM IST
Ravi Teja: ఓవర్ చెయ్యకు.. హరీష్ శంకర్ కు షాకింగ్ రిప్లై ఇచ్చిన రవితేజ

Ravi Teja Harish Shankar Movie: ఈమధ్య కాలంలో వరుసగా అన్ని ఫ్లాప్ సినిమాలు మాత్రమే అందుకుంటున్న మాస్ మహారాజా రవితేజ.. తన ఆశలన్నీ మిస్టర్ బచ్చన్.. పైనే పెట్టుకున్నాడు. ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ ..ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అసలు హరీష్ శంకర్ డైరెక్టర్ గా మారింది ఈ రవితేజ షాక్ సినిమాతోనే. 

ఆ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో మిరపకాయ సినిమా కూడా విడుదలైంది. దాదాపు 13 ఏళ్ల తర్వాత.. మళ్లీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇప్పుడు సినిమా రాబోతోంది. అదే మిస్టర్ బచ్చన్. టైటిల్ తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న ఈ చిత్రం త్వరలో.. విడుదలకు సిద్ధం అవుతుంది. ప్రస్తుతం సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. హిందీలో అజయ్ దేవగన్ హీరోగా నటించి.. సూపర్ హిట్ అయిన రైడ్ సినిమాకి.. రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హరీష్ శంకర్.. సినిమాకి సంబంధించి కూడా ఏదో ఒక పోస్ట్ పెడుతూ.. అభిమానులకు అప్డేట్ ఇస్తూ ఉంటారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో.. కూడా లొకేషన్ నుంచి ఏదో ఒక ఫోటో షేర్ చేస్తూ ఉంటారు.

తాజాగా ఒక ఫోటోని షేర్ చేస్తూ "అందరికీ వయసు వస్తుంది. అన్నయ్యకి తప్ప. కాశ్మీర్ వ్యాలీ లో షూటింగ్ జరుగుతుంది. త్వరలోనే హైదరాబాద్ కి వస్తాము" అని మిస్టర్ బచ్చన్ షూటింగ్ అప్డేట్ తో పాటు రవితేజ ని పొగుడుతూ ట్వీట్ చేశారు హరీష్ శంకర్. దానికి రవితేజ షాకింగ్ రిప్లై ఇచ్చారు. 

 

"ఓవర్ చేయకు రోయ్. నీ దిష్టే తగిలేలా ఉంది" అంటూ రవితేజ కామెడీగా రిప్లై.. ఇవ్వడం నెట్టింట్లో వైరల్ అయ్యింది. రవితేజ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా బాగుంటుంది అంటూ.. అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్.. త్వరగా పూర్తి చేసి.. దసరాకి సినిమాని విడుదల చేసే అవకాశం ఎక్కువగా ఉంది.

భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత రవితేజ భాను భోగవరపు దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది.

Read more: Viral News in Telugu: కొంపముంచిన రీల్.. 300 అడుగుల లోతైన లోయలో పడిపోయిన కారు.. షాకింగ్ వీడియో

Read more: Viral video: అట్లుంటదీ మల్ల.. నరసింహ మూవీ స్టైల్ లో పాముకు కిస్ ఇచ్చిన తాత.. వీడియో వైరల్..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News