Tiger Nageswara Rao: సైన్ లాంగ్వేజ్ లో గ్రాండ్ గా రిలీజ్ కానున్న టైగర్‌ నాగేశ్వరరావు

Ravi Teja New Movie: రవితేజ నయా మూవీ టైగర్‌ నాగేశ్వరరావు. తాజాగా ఈ మూవీ నుంచి సాలిడ్ అప్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. అది ఏంటంటే?  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 14, 2023, 04:54 PM IST
Tiger Nageswara Rao: సైన్ లాంగ్వేజ్ లో గ్రాండ్ గా రిలీజ్ కానున్న టైగర్‌ నాగేశ్వరరావు

Tiger Nageswara Rao Update:  మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) హీరోగా న‌టిస్తున్న పాన్ ఇండియా సినిమా టైగర్‌ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao). ఈ మూవీకి యువ దర్శకుడు వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇండియాలో అతి పెద్ద గజదొంగగా పేరుగాంచిన స్టువర్టుపురం టైగర్ నాగేశ్వరరావు జీవితకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ మూవీపై వీర లెవల్లో అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ మూవీ నుంచి కీలక అప్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. 

ఇప్పటికే బధిరుల కోసం సైన్ లాంగ్వేజ్‌ లో కూడా ట్రైలర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బధిరుల కోసం ఈ మూవీని ఇండియా మరియు ఓవర్సీస్ లో సైన్ లాంగ్వేజ్‌లో 65 కంటే ఎక్కువ స్క్రీన్స్‌లో విడుద‌ల చేస్తున‌ట్లు మేకర్స్ ప్రకటించారు. ఇలాంటి ఫీట్ చేసిన తొలి తెలుగు సినిమాగా అత్యంత అరుదైన రికార్డును టైగర్‌ నాగేశ్వరరావు సొంతం చేసుకుంది. ఈ మూవీని అక్టోబర్ 20న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. అదే రోజు ఇండియ‌న్ సైన్ లాంగ్వేజ్‌లో కూడా మూవీని విడుదల చేయనున్నారు మేకర్స్. 

ఈ సినిమాలో కృతి స‌న‌న్ చెల్లి నుపుర్ సనన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. మరో ఫీమేల్ లీడ్ రోల్ లో గాయత్రి భరద్వాజ్ కనిపించనుంది. ఇందులో రేణు దేశాయ్, మురళీ శర్మ, అనుపమ్ ఖేర్, జిస్సు సెంగుప్త కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి టాలెంటెడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. 

Also Read: Maa Oori Polimera 2 Trailer: ఆసక్తి రేకెత్తిస్తోన్న 'మా ఊరి పొలిమేర-2' ట్రైలర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News