Tiger Nageswara Rao: 'టైగర్ నాగేశ్వరరావు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్స్ ఎవరో తెలుసా?

Tiger Nageswara Rao Movie: రవితేజ నయా మూవీ 'టైగర్ నాగేశ్వరరావు'. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఆదివారం నిర్వహించనున్నారు. దీనికి ముఖ్య అతిథులగా ఎవరు రానున్నారోతెలుసా?  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 14, 2023, 11:39 PM IST
Tiger Nageswara Rao: 'టైగర్ నాగేశ్వరరావు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్స్ ఎవరో తెలుసా?

Tiger Nageswara Rao Pre release event: మాస్ మాహారాజా రవితేజ లేటెస్ట్ మూవీ 'టైగర్ నాగేశ్వరరావు'. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ మూవీ దసరా కానుకగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ షురూ చేసింది మూవీటీమ్. డైరెక్టర్ వంశీ, హీరో రవితేజ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ మూవీని జనాల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తారు.

ఇండియాలో అతి పెద్ద గజదొంగగా పేరుగాంచిన స్టువర్టుపురం టైగర్ నాగేశ్వరరావు జీవితకథ ఆధారంగా ఈ మూవీ రూపొందుతుంది.  ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ మూవీపై భారీగా అంచనాలను క్రియేట్ చేశాయి. ఈ చిత్రానికి అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా వ్యవహరించారు. అక్టోబర్ 20న ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో రిలీజ్ చేయబోతున్నారు. 

ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈనెల 15న నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగే ఈ వేడుకకు కిషన్ రెడ్డి.. రచయిత విజయేంద్ర ప్రసాద్, హరీశ్ శంకర్, గోపిచంద్ మలినేని, చందూ మొండేటి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో రవితేజ సరసన బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ చెల్లెలు నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ నటించారు. అలాగే ఇందులో సీనియర్ హీరోయిన్ రేణు దేశాయ్ కీలకపాత్రలో నటించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందించారు. 

Also Read: Mission Raniganj oscars : ఆస్కార్‌ రేసులో అక్షయ్‌కుమార్‌ నయా మూవీ..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News