Eagle Twitter Review: ఈగల్ ట్విట్టర్ రివ్యూ.. బాక్సాఫీస్‌పై మాస్ మహారాజా దాడి

Eagle Twitter Review in Telugu: ఈగల్ మూవీతో బాక్సాఫీస్‌పై దాడి చేసేందుకు సిద్ధమయ్యాడు మాస్ మహారాజా రవితేజ. ఈ సినిమా సంక్రాంతికే రావాల్సి ఉండగా.. థియేటర్ల ఇబ్బంది కారణంగా నేడు ఆడియన్స్‌ ముందుకు రానుంది. మరి ఈగల్ ట్విట్టర్ టాక్ ఎలా ఉంది..? ఆడియన్స్ ఏమంటున్నారు..?  

Written by - Ashok Krindinti | Last Updated : Feb 9, 2024, 06:41 AM IST
Eagle Twitter Review: ఈగల్ ట్విట్టర్ రివ్యూ.. బాక్సాఫీస్‌పై మాస్ మహారాజా దాడి

 Eagle Twitter Review in Telugu: మాస్ మ‌హారాజా ర‌వితేజ-కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని కాంబోలో తెరకెక్కిన మూవీ ఈగల్. ధమాకా వంటి సూపర్ సక్సెస్ తరువాత పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌లో రవితేజ నటించిన మూవీ ఇది. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, కావ్య థాప‌ర్ హీరోయిన్స్‌గా యాక్ట్ చేశారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌తో ఈగల్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శుక్రవారం ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. ఇప్పటికే ఓవర్సీస్‌లో కొన్ని షోలు పడ్డాయి. మరి ప్రీమియర్ టాక్ ఎలా ఉంది..? ట్విట్టర్‌లో ఆడియన్స్‌ రెస్పాన్స్ ఎలా ఉంది..? రావ‌ణాసుర‌, టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు వంటి ఫ్లాప్స్ తరువాత రవితేజ హిట్ అందుకున్నాడా..? ఓ లుక్కేద్దాం పదండి.. 

ఈగల్ మూవీతో రవితేజ మరో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టేశాడని టాక్ వస్తోంది. బెస్ట్ యాక్షన్ మూవీగా ఈగల్ నిలవనుందని ట్వీట్స్ చేస్తున్నారు. ఇంటర్వెల్ సీక్వెన్స్ థియేటర్లలో బ్లాస్ట్ అవుతుందని అంటున్నారు. సెకాండఫ్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందని.. రవితేజకు కమ్‌బ్యాక్ మూవీ అని.. ఇందులో ఎలాంటి సందేహం లేదంటున్నారు. లాస్ట్ 40 నిమిషాలు అద్భుతంగా ఉందని.. స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ అదిరిపోయిందంటున్నారు. బ్యాక్‌గ్రౌండ్ సినిమా మొత్తం అద్భుతంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. యాక్షన్ సీక్వెన్సులో రవితేజ యాక్టింగ్ నెక్ట్స్‌ లెవల్ అని.. సినిమా నిర్మాణ విలువను చూపించే టాప్ నాచ్ విజువల్స్ ఉన్నాయని ఓ నెటిజన్ రివ్యూ ఇచ్చాడు. 

 

 

 

 

రవితేజ కొత్త లుక్‌లో కనిపిస్తారని నెటిజన్లు చెబుతున్నారు. విజువల్స్ అదిరిపోయాయంటున్నారు. మ్యూజిక్ బాగుందని.. సినిమా క్లైమాక్స్ చరిత్రలో ఒకటిగా నిలిచిపోతుందంటున్నారు. నటీనటులందరి పెర్ఫార్మెన్స్ బాగుందని.. రొమాంటిక్ యాంగిల్ చాలా బాగా వర్క్ అవుట్ అయ్యిందని రివ్యూలు ఇస్తున్నారు. 

 

అత్యద్భుతంగా విజువల్స్ ఉన్నాయని.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సూపర్‌గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉన్నా.. సెకాండఫ్‌ బ్లాక్‌బాస్టర్‌ హిట్‌గా ఉందంటున్నారు. రవితేజ యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేశాడని.. ప్రొడక్షన్ వాల్యూస్ అదిపోయాయని చెబుతున్నారు. 

 

క్లైమాక్స్ సీన్స్ ర్యాంప్ ఆడిస్తాయని..క్లైమాక్స్ ఫైట్‌లో రావన్న (రవితేజ) విశ్వరూపం చూస్తారని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. స్క్రీన్‌ ప్లే ర్యాంప్ ఆడించాడని.. ఫస్టాఫ్ ఒకే అనిపించినా.. సెకండాఫ్ సినిమాను లేపిందని చెప్పాడు. ఈగల్ పార్ట్‌-2 ఎలా ఉంటుందో చూడాలంటూ ఓ లీక్ ఇచ్చేశాడు. సినిమా యుద్ధ ఖండం అని ఫైన్ ఫైనల్ రివ్యూ చెప్పేశాడు.

 

 

Trending News