Rashmika Limps On One Feet at Chhava Event: టాలీవుడ్ హీరోయిన్ రష్మిక ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలలో నటిస్తూ, భారీ క్రేజ్ అందుకుంది. పుష్ప సినిమా తర్వాత ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించి నేషనల్ క్రష్ గా కూడా పేరు సంపాదించింది. గత కొద్ది రోజుల క్రితం రష్మిక గాయపడిన సంగతి అందరికీ తెలిసిందే. జిమ్ లో కసరత్తులు చేస్తూ ఉండగా.. తన కాలికి ప్రమాదం జరిగిందనే విషయం తెలియజేస్తూ.. కొన్ని ఫోటోలను కూడా ఇటీవల షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
అయితే ఈ రోజున హైదరాబాద్ విమానాశ్రయంలో వీల్ చైర్ లో కనిపించి మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. కానీ ఇప్పుడు తాజాగా ఛావా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు హాజరైన రష్మిక తన కాలు సహకరించకున్నప్పటికీ కుంటుకుంటూ వెళ్తూ ఈవెంట్లో స్టేజ్ మీదకు వెళ్లిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రష్మిక ఇలా నడుస్తుండడం చూసి హీరో విక్కీ కౌశల్ ఆమెను చేయి పట్టుకొని మరీ నడిపించారు. ఈ విషయం చూసిన అభిమానులు ఆశ్చర్యపోవడమే కాకుండా రష్మిక చేస్తున్న ఈ పనికి కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉండగా మరి కొంతమంది రష్మిక ఇంత అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఛావా చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటించగా.. విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ చిత్రాన్ని లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్షన్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా చత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు అయిన శంబాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శంబాజీ భార్య ఏసు భాయి పాత్రలోనే రష్మిక నటిస్తూ ఉన్నదట. ఈ సినిమా వచ్చే నెల 14వ తేదీన రిలీజ్ చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేశారు.
ఇటీవలే ఈ సినిమా నుండి ఈమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా రివీల్ చేయగా.. అందులో ఆమె రాజసం ఉట్టిపడేలా అద్భుతమైన లుక్కుతో అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా పట్టు చీరలు ఆభరణాలతో నిండుగా కనిపించింది రష్మిక.
Also Read: Akhanda 2 Movie: లొకేషన్ల కోసం అన్వేషణ.. అఖండ 2 'పని' మొదలుపెట్టిన బోయపాటి
Also Read: Tirumala Actors: తిరుమలలో 'సార్' హీరోయిన్ ప్రత్యేక పూజలు.. ఇతర ప్రముఖులు కూడా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.