సంజయ్ దత్‌కి అంతమందితో ఎఫైర్ వుందా ?

సంజయ్ దత్ ట్రైలర్ 

Last Updated : May 30, 2018, 08:44 PM IST
సంజయ్ దత్‌కి అంతమందితో ఎఫైర్ వుందా ?

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న సంజు సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్న రణ్ బీర్ కపూర్ ఇప్పటికే సంజూ పాత్రలో ఒదిగిపోయేంతగా అచ్చం అతడిలాగే శరీరాకృతిని పెంచుకుని కనిపించిన వైనం ఆకట్టుకున్న వైనం సంగతి తెలిసిందే. బాలీవుడ్ ఆడియెన్స్ కి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా రణ్ బీర్ కపూర్ కెరీర్ కి కచ్చితంగా ఓ ప్లస్ పాయింట్ కానుంది అని ఇప్పటికే బాలీవుడ్ సినీ విమర్శకులు అతడిని ఆకాశానికెత్తేస్తున్నారు. సంజు టీజర్ లో రణ్ బీర్ కపూర్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, స్టైల్ అచ్చం సంజయ్ దత్ ని అనుకరించినట్టుగా ఉండటమే అందుకు ప్రధాన కారణం. 

 

ఇదిలావుండగా తాజాగా కొద్దిసేపటి క్రితమే సంజు సినిమా ట్రైలర్ సైతం విడుదలైంది. సంజయ్ దత్ తండ్రి సునీల్ దత్ పాత్రలో పరేశ్ రావల్ నటిస్తుండగా తల్లి నర్గిస్ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటి మనీషా కొయిరాలాను చూడవచ్చు. అనుష్కా శర్మ, సోనమ్ కపూర్, దియా మిర్జా, బొమన్ ఇరానీ, విక్కీ కౌశల్, కరిష్మా తన్నా, జిమ్ సర్బ్ వంటి నటీనటులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సంజూ మూడు దశాబ్ధాల కెరీర్ లో అతడు అనుభవించిన ఆరు దశలను.. అంటే సంజూ ఎరవాడ జైలు నుంచి విడుదలై బయటికొచ్చే వరకు జరిగిన ఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. 

Trending News