Ranbir Kapoor Ramayan: రణబీర్ కపూర్ రామాయణానికి రంగం సిద్ధం.. మొదటి పార్ట్ కథ ఇదేనట!

Sai Pallavi: యావత్ భారతదేశం గర్వించదగే విధంగా.. గొప్ప దృశ్య కావ్యంగా.. రామాయణాన్ని తీర్చిదిద్దడానికి డైరెక్టర్ నితీష్ తివారి పూనుకున్నారు. ఈ నేపథ్యంలో మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ వైరల్ అవుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 9, 2024, 10:07 AM IST
Ranbir Kapoor Ramayan: రణబీర్ కపూర్ రామాయణానికి రంగం సిద్ధం.. మొదటి పార్ట్ కథ ఇదేనట!

Ranbir Kapoor-Sai Pallavi: రామాయణం.. ఇది రాముడి చరిత.. రమనీయమైన కావ్యం. ఎన్నిసార్లు విన్నా.. ఎందరు చిత్రీకరించినా..ఇంకా చూడాలి అనిపించే ఒక సుమధుర చరిత్ర. అటువంటి రామాయణాన్ని బాలీవుడ్ తో పాటు భారతదేశంలోనే ఇప్పటివరకు తియ్యనటువంటి అద్భుతమైన దృశ్య కావ్యంగా తెరకెక్కించడానికి నితీష్ తివారి ఫిక్సయ్యారు. ఇక ఈ మూవీలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి ఇప్పటికే కన్ఫామ్ అయ్యారు. రామాయణంలో రాముడి పాత్రతోపాటు మరొక ముఖ్యమైన పాత్ర రావణాసురుడు.

పేరుకే రాక్షసుడు..కానీ  అత్యంత సుందరుడు. ఈ భారీ కాయానికి భారీగా కటౌట్ కావాలి కదా.. అందుకే మన కేజిఎఫ్ ఫేమ్ యష్ ను ఈ పాత్రకు తీసుకోబోతున్నట్లు టాక్. దీని గురించి ఇప్పటికే అతనితో మాట్లాడడం జరిగిందని.. ఈ పాత్ర చేయడానికి అతను ఒప్పుకున్నాడని నార్త్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. అయితే ఇంకా ఈ విషయం పై యష్ సైడ్ నుంచి ఎటువంటి అధికారిక క్లారిఫికేషన్ రాలేదు. ఇక ఇందులో మిగిలిన పాత్రలకు ఎవరిని తీసుకుంటారు అన్న విషయం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది.

ఈ మూవీని వచ్చే నెల ఏప్రిల్ 17న లాంచ్ చేయడానికి చిత్ర బృందం రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి కొన్ని కీలక వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ రామాయణం చిత్రాన్ని మొత్తం మూడు భాగాలలో తీస్తారట. మొదటి భాగం అయోధ్యకాండ.. రాముడి పరిచయం, సీత స్వయంవరం, ఆ తర్వాత వనవాసంతో మొదలుపెట్టి మెల్లిగా కథను ముందుకు తీసుకువెళ్తారు. ఇక  అడవిలో రావణాసురుడు సీతమ్మను అపహరించడం, ఆ తర్వాత హనుమంతుడు ఎంట్రీ.. వాలిని రాముడు చంపడం ..ఇటువంటి ఘట్టాలన్నీ మనం రామాయణం రెండవ భాగంలో చూస్తాం.

ఈ మూవీకి సంబంధించి విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు టాక్. ఎఫెక్ట్స్ కు తగినట్టుగా ప్రేక్షకులు మంచి అనుభూతి చెందే విధంగా స్క్రిప్ట్ ను కూడా డెవలప్ చేస్తున్నారట. ఇక ఈ మూవీలో సన్నీడియోల్ ,రకుల్ ప్రీత్ సింగ్ లాంటి భారీ తారాగణాన్ని తీసుకుంటున్నారు. ఈ చిత్రంలోని చిన్న పాత్ర దగ్గర నుంచి పెద్ద పాత్ర వరకు ఎంతో జాగ్రత్తగా డిజైన్ చేయడమే కాకుండా.. పాత్రకు తగినట్టుగా ఉండే వ్యక్తులను తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఈ మూవీ 2025 లో విడుదలయ్యే విధంగా చిత్ర బృందం ప్లానింగ్ చేస్తున్నారు. ఈ మూవీ ఓపెనింగ్ కు సంబంధించిన ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా ప్రధానమంత్రిని పిలిచే ఆలోచనలో చిత్ర బృందం ఉంది. అయితే ఎన్నికల సమయం కావడంతో ప్రధాని డేట్స్ ఎంత వరకు దొరుకుతాయి అన్న విషయం పై స్పష్టత లేదు. రాముడికి సంబంధించిన సినిమా కావడం చేత.. ఎంత బిజీగా ఉన్నా ప్రధాని నో చెప్పే అవకాశం ఉండదు అని అంచనా. ఈ నేపథ్యంలో రణబీర్ కపూర్ ని రాముడిగా ఎలా చూపిస్తారు అన్న విషయంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. అతను రీసెంట్గా నటించిన యానిమల్ చిత్రంలో ఎంత వైల్డ్ గా కనిపించాడో అందరికీ తెలుసు. ఆ ఇంప్రెషన్ తో కంటిన్యూ అవుతున్న యాక్టర్ ను రాముడిగా.. ఓ భగవంతుడిగా ఎలా చూపిస్తారో చూడాలి మరి.

Also Read: మెగా కాంపౌండ్ హీరోల కష్టాలు.. ఇక రంగంలోకి మెగాస్టార్ దిగాల్సిందేనా!

Also Read: బావ ఈజ్ బ్యాక్.. మిస్టర్ ఈగో చిందులు.. బెడ్‌రూం కంటే జైలు బెట్టర్ అంటున్న కల్యాణ్..

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News