రాజీవ్ గాంధీ మరణం నేపథ్యంలో గతంలో యువ నటుడు రానా దగ్గుబాటి ఓ చిత్రాన్ని నిర్మిస్తానని తెలిపిన విషయం తెలిసిందే. విజేత పిక్చర్స్ అధినేత ఏఎంఆర్ రమేష్, రానా నిర్మాతలుగా తెరకెక్కే ఈ చిత్రాన్ని ఇప్పుడు సినిమా రూపంలో కాకుండా వెబ్ సిరీస్‌గా నిర్మించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 'ఎల్టీటీఐ' పేరుతో తెరకెక్కే ఈ వెబ్ సిరీస్‌కి పలువురు హాలీవుడ్ సాంకేతిక నిపుణులు కూడా పనిచేయనున్నారని సమాచారం.
తెలుగుతో పాటు కన్నడం, తమిళం, హిందీల్లో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనుంది. రానా ఈ సిరీస్‌లో ఒక ప్రధానమైన పాత్రను కూడా పోషిస్తున్నారు. గతంలో 'ఆస్ఫోటా - ది హ్యూమన్ బాంబ్' పేరుతో ఈ చిత్రాన్ని రూపొందించాలని భావించారట. అయితే ఎందుకో మళ్లీ ఆ ఐడియాని కాదని.. వెబ్ సిరీస్ వైపు మొగ్గుచూపుతున్నారు నిర్మాతలు.
రాజీవ్ మరణంపై.. 'రానా' వెబ్ సిరీస్