Ramya Krishna Pics: లేటు వయసులో ఘాటు అందాలు.. శారీలో రమ్యకృష్ణ గ్లామర్ ట్రీట్ పోలా అదిరిపోలా!

Ramya Krishna Latest Saree Pictures shakes internet. 'డాన్స్ ఐకాన్' షో కోసం రమ్యకృష్ణ శారీలో దర్శమిస్తున్నారు. ఆ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 19, 2022, 07:03 PM IST
  • లేటు వయసులో ఘాటు అందాలు
  • శారీలో రమ్యకృష్ణ గ్లామర్ ట్రీట్ పోలా అదిరిపోలా
  • మరోసారి రమ్యకృష్ణ అందాల విందు
Ramya Krishna Pics: లేటు వయసులో ఘాటు అందాలు.. శారీలో రమ్యకృష్ణ గ్లామర్ ట్రీట్ పోలా అదిరిపోలా!

Actress Ramya Krishna looks stunning in latest Saree Pictures: 1970 సెప్టెంబర్ 15న చెన్నైలో సీనియర్ నటి రమ్యకృష్ణ జన్మించారు. తమిళనాట పాత్రికేయులు, విమర్శకులు చో రామస్వామి మేనకోడలే ర‌మ్య‌ కృష్ణ. 

1985లో వచ్చిన 'భలే మిత్రులు' చిత్రంతో రమ్యకృష్ణ కథానాయికగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 1989లో వచ్చిన 'సూత్రధారులు' చిత్రం ద్వారా నటిగా మంచి పేరు సంపాదించారు.

సౌత్ ఇండస్ట్రీలో 'లేడీ సూపర్ స్టార్‏'గా పేరు తెచ్చుకున్న రమ్యకృష్ణ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో దాదాపుగా 250 సినిమాల్లో ఆమె నటించారు. 

తెలుగులో చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ, శ్రీకాంత్, జగపతిబాబు వంటి స్టార్ హీరోలతో రమ్యకృష్ణ స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  రమ్యకృష్ణ తన నటన, అందంతో తెలుగు ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేశారు. 

2003లో డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీని పెళ్లి చేసుకుని కొన్ని రోజులు సినిమాల‌కు దూరంగా ఉన్న రమ్యకృష్ణ.. నరసింహ సినిమాలో ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న నటించారు. ఆ సినిమాలో తన విలనిజాన్ని మ‌రో కోణంలో చూపెట్టి ప్రేక్షకులమన్ననలు పొందారు.

పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ 'బాహుబ‌లి' సినిమాలో శివ‌గామి పాత్ర‌లో న‌టించి రమ్యకృష్ణ ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమాతో రమ్యకృష్ణ రేంజ్ మరో స్థాయికి చేరింది. ఇప్పటికీ ఆమెకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. 

రమ్యకృష్ణ ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు 'డాన్స్ ఐకాన్' షో చేస్తున్నారు. ఈ షో కోసం రమ్యకృష్ణ శారీలో దర్శమిస్తున్నారు. ఆ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. 

Also Read: Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. Realme 9 5G SEపై రూ. 5 వేల ఆఫర్!

Also Read: OTT Release: కార్తికేయ 2, బింబిసార ఓటీటీ విడుదలపై స్పందించిన జీ5!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News