రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డులు దక్కాయి. ఈ అవార్డు కార్యక్రమానికి రామ్‌చరణ్ ఏ లుక్‌లో హాజరుకానున్నాడో తెలిస్తే అభిమానులు ఫిదా కావల్సిందే.
జనవరి 11వ తేదీన లాస్ ఏంజిల్స్‌లో గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి హాజరుకానున్నారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగరీలో నాటు నాటు సాంగ్, బెస్ట్ నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేటగరీలో మరో అవార్డుకు ఆర్అర్ఆర్ సినిమా నామినేట్ అయింది. మరోవైపు ఆస్కార్ అవార్డుల రేసులో నిలిచింది. కలెక్షన్ పరంగా ప్రపంచవ్యాప్తంగా సునామీ సృష్టించిన ఆర్ఆర్ఆర్ అంతర్జాతీయంగా అందర్నీ ఆకట్టుకుంది.
ఇప్పుడు లాస్ ఏంజిల్స్‌లో జరిగే గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమానికి రామ్‌చరణ్ ప్రత్యేకమైన రాయల్ లుక్‌లో కన్పించబోతున్నాడు. ఈ ఈవెంట్ కోసం ప్రత్యేకంగా డ్రెస్ డిజైన్ చేయించాడు. బ్లాక్ కలర్ రాయల్ సూట్‌పై ఆర్ఆర్ఆర్ పేరు ఉంటుంది. బ్లాక్ కలర్ రాయల్ సూట్‌లో పోజులిచ్చిన రామ్‌చరణ్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అభిమానుల్ని ఫిదా చేస్తున్నాయి.
Also read: Sreeja Konidela : ఆ వ్యక్తిని కనుగొన్నా.. కొత్త జీవితానికి ఆరంభం ఇదే.. శ్రీజ కొణిదెల పోస్ట్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook