Ram Pothineni Marriage : రామ్ పోతినేని ప్రేమ పెళ్లికి రంగం సిద్ధం.. అమ్మాయి ఎవరో తెలుసా?

Ram Pothineni getting married to his love : హీరో రామ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కే అవకాశం ఉందని అంటున్నారు. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుందని అంటున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 26, 2022, 12:37 PM IST
  • మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోలలో ఒకరిగా రామ్

    త్వరలో పెళ్లి పీటలు ఎక్కే అవకాశం

    ఆమెతోనే అంటూ ప్రచారం

Ram Pothineni Marriage : రామ్ పోతినేని ప్రేమ పెళ్లికి రంగం సిద్ధం.. అమ్మాయి ఎవరో తెలుసా?

Ram Pothineni getting married to his love : తెలుగు హీరోలలో ఇంకా వివాహ బంధంలో అడుగు పెట్టాల్సిన హీరోలు చాలామంది ఉన్నారు. గత రెండు మూడేళ్ళ సమయంలో కొంతమంది వివాహం చేసుకున్నారు కానీ వివాహం చేసుకోవాల్సిన హీరోల లిస్టు చాలా పెద్దదే. అందులో ముందుగా ప్రభాస్ గురించి,  ఆ తర్వాత చెప్పుకోవాల్సింది శర్వానంద్,  రామ్,  నాగ శౌర్య,  అఖిల్,  విశ్వక్సేన్,  విజయ్ దేవరకొండ వంటి వారి గురించి. ఇప్పుడు వీరిలో రామ్ పోతినేని పెళ్లి చేసుకునేందుకు రెడీగా ఉన్నాడని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది

2006వ సంవత్సరంలో దేవదాసు అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు రామ్ పోతినేని. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటించింది. చేసిన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న రామ్ ఇప్పుడు టాలీవుడ్ టైర్-2 హీరోలలో టాప్ లిస్ట్ లో కనిపిస్తాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకుని ఫాంలోకి వచ్చిన రామ్ మరి కొద్ది రోజులలో ది వారియర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సర్వం సిద్ధమవుతోంది. 

ఇక రామ్ పోతినేని ఇప్పుడు పెళ్లి పీటలేక్కేందుకు సిద్ధమవుతున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అంతేకాక రామ్ ది ప్రేమ వివాహమని తెలుస్తోంది. తన బాల్య స్నేహితురాలు,  స్కూల్ మేట్ అయిన ఒక యువతితో గత కొంత కాలంగా రామ్ ప్రేమలో ఉన్నాడని ఇప్పుడు ఆమెను వివాహం చేసుకోనున్నాడని తెలుస్తోంది. ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు ప్రేమ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.

ఇక దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేస్తారని ఫిలింనగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ది వారియర్ సినిమా షూటింగ్ పూర్తిచేసి ఇప్పుడు విడుదలకు సిద్ధం చేసిన రామ్,  బోయపాటి శ్రీను  దర్శకత్వంలో మరో సినిమా ప్రకటించారు. ఇక వివాహం జరిగిన తర్వాత బోయపాటి శ్రీను సినిమా షూటింగ్ మొదలు పెడతారా? లేక షూటింగ్ మధ్యలో ఉండగా వివాహం చేసుకునే అవకాశం ఉందా అనే విషయం మీద ఎలాంటి క్లారిటీ లేదు. రామ్ హీరోగా నటించిన ది వారియర్ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతోంది తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. 

Also Read:Ranbir Kapoor First Wife : అలియాతో రెండో పెళ్లి.. మొదటి భార్య గుట్టు బయటపెట్టిన రణబీర్ కపూర్!

Also Read:AP Theaters Shutdown: ఏపీలో సినీ థియేటర్లను బంద్ చేయాలని నిర్ణయం..ఎందుకంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News