Bombay andheri court 3 months jail in cheque bounce case: కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తలలో నిలిచారు. ఆయన న్యూఇయర్ రోజు.. ఇక మీదట ఎలాంటి కాంట్రవర్సీ అంశాల జోలికిపోనని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఆర్జీవీకి ముంబై కోర్టు తాజాగా.. చెక్ బౌన్స్ కేసులో సంచలన తీర్పు వెల్లడించింది. ఈకేసులో.. బాధితుడికి రూ. 3.72 లక్షల పరిహారం అందించడంతో పాటు మూడు నెలల శిక్ష విధిస్తు తీర్పునిచ్చింది.
With regard to the news about me and Andheri court, I want to clarify that it is to do with a 7 year old case of Rs 2 lakh 38 thousand amount , relating to my ex-employee .. My advocates are attending to it. and since the matter is in court i cannot say anything further
— Ram Gopal Varma (@RGVzoomin) January 23, 2025
అంతేకాకుండా.. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చింది. ఒక వేళ కోర్టు ఆదేశించిన మేరకు పరిహారం చెల్లించకపోతే.. మరో మూడు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని స్పష్టం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన కేసు 2018లో నమోదైంది. ఇదిలా ఉండగా.. దీనిపై తాజాగా.. ఆర్జీవీ ఇన్ స్టా వేదికగా సంచలన ట్విట్ చేశారు.
చెక్ బౌన్స్ కేసు గురించి మాట్లాడుతూ.. ఇది 7 ఏళ్ల క్రితం జరిగిన విషయమన్నారు. ఆరోపణలు చేసిన వ్యక్తి.. తన దగ్గర గతంలో పనిచేశాడన్నారు. ఇది రూ. 2.38 లక్షల చెక్ బౌన్స్ కేసని క్లారిటీ ఇచ్చారు. దీనిపై తనవైపు నుంచి లాయర్ లు కోర్టులో వాదిస్తున్నారని.. దీనిపై ఇంతకన్న ఎక్కువగా మాట్లాడకుడదన్నారు. కోర్టు పరిధిలో ఉన్నందున తాను ఇంతకు మించి మరేమీ చెప్పలేనని కూడా ఆర్జీవీ ట్విట్ చేశారు.
Read more: Rashmika mandanna: ఇదే నా లాస్ట్ సినిమా.. రిటైర్ అయిపోతున్న..!.. బాంబు పేల్చిన రష్మిక మందన్న..
2018లో మహేష్ చంద్ర అనే వ్యక్తి చెక్ బౌన్స్ కేసులో ముంబైలోకి అంధేరీ కోర్టు తాజాగా తీర్పు వెల్లడించింది. అయితే.. గత ఏడేళ్లుగాదీనిపై ఇయరింగ్స్ జరుగుతున్నాయని, ఆర్జీవీ మాత్రం ఏనాడూ కోర్టులో హాజరు కాలేదని తెలుస్తొంది. ఈ నేపథ్యంలో అంధేరీ కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి పైవిధంగా తీర్పునిచ్చింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి