RGV Vyuham Update: జగన్ బయోపిక్ కాదిది.. ఆ పరిస్థితులే ఆధారంగా వ్యూహం.. బయటపెట్టిన వర్మ!

Ram Gopal Varma Update on Vyuham Movie: రాంగోపాల్ వర్మ వైఎస్ జగన్ మీద సినిమా చేస్తానని ప్రకటించగా ఇప్పుడు ఆ వ్యూహం సినిమా మీద అప్డేట్ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే  

Last Updated : Jan 16, 2023, 07:20 PM IST
RGV Vyuham Update: జగన్ బయోపిక్ కాదిది.. ఆ పరిస్థితులే ఆధారంగా వ్యూహం.. బయటపెట్టిన వర్మ!

Ram Gopal Varma Gave Update on Vyuham Movie: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ వైఎస్ జగన్ మీద సినిమా చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వ్యూహం అనే సినిమా టైటిల్ కూడా ఆయన అనౌన్స్ చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చారు రాంగోపాల్ వర్మ. తాజాగా ఉభయగోదావరి జిల్లాలలో కోడిపందాలు చూసేందుకు వెళ్లిన వర్మ రెండు గోదావరి జిల్లాలో కలియ తిరుగుతున్నారు. ఎక్కడికక్కడ కోడి పందాల బరుల్లో కనిపిస్తూ సందడి చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే త్వరలోనే ఈ సినిమాని సెట్స్ మీదకు తీసుకువెళ్లబోతున్నట్లుగా అప్డేట్ ఇచ్చారు.

తాజాగా కాకినాడకు చెందిన వైసిపి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి వెళ్లే ఆయన ఆతిథ్యం స్వీకరించిన వర్మ అక్కడ విలేకరులతో మాట్లాడారు.  అందరూ ఊహిస్తున్న విధంగానే తాను తీయబోయే తర్వాతి సినిమా జగన్ బయోపిక్ కాదని ఈ విషయం ఇదివరకే చెప్పారని వర్మ అన్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు, అప్పటి పరిస్థితులు అప్పటి ఉద్విగ్న వాతావరణం గురించి ఈ సినిమా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ సినిమా అంతా ఒక పొలిటికల్ థ్రిల్లర్ అనిపిస్తుందని త్వరలో షూటింగ్ కూడా ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు.

ఇక ఇదే విషయం మీద వైఎస్ జగన్ ను కొన్నాళ్ల క్రితం రాంగోపాల్ వర్మ కలిశారు. అప్పట్లో జగన్కు అనుకూలంగా ఏదైనా సినిమా చేస్తారని అనుకుంటే ఇప్పుడు వైఎస్ మరణం నాటి సెంటిమెంట్ ని మరోసారి రగిలించే ప్రయత్నం చేస్తున్నారనే విషయం తెర మీదకు వచ్చింది. ఇక ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఉండే రామ్ గోపాల్ వర్మ బయటకు మాత్రం తాను పవన్ అభిమానినని ఆయన మంచి కోరుకుంటున్నాను అని చెబుతూ ఉంటారు.

ఇప్పుడు కూడా విలేకరులతో మాట్లాడుతూ తాను జనసేన పార్టీ అభిమానిని అని పవన్ గురించి కానీ జనసేన గురించి కానీ ఏదైనా ట్వీట్ చేసిన కామెంట్ చేసిన అవి అభిమానంతో చేసినవే తప్ప మరోటి కాదని చెప్పుకొచ్చారు. తాను చేసిన ట్వీట్లను పొరపాటుగా అర్థం చేసుకుంటే అది పవన్ కర్మ అంటూ కామెంట్స్ చేశారు. ఇక తాను ఆయనను కించపరిచే విధంగా ఎప్పుడూ కామెంట్ చేయలేదని చెప్పుకొచ్చారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే కోడిపందాలు పైన కూడా ఒక సినిమా చేస్తానని ఆయన అన్నారు. కోడిపందాలకు ముందు ఆ తర్వాత సంభవించే పరిణామాల మీద అందరూ ఒప్పుకునే విధంగా ఒక రియలిస్టిక్ సినిమా తీస్తానని తన పర్యటన కూడా ఈ విషయం మీద జరుగుతోందని చెప్పుకొచ్చారు. చాలామంది పందెం రాయుళ్లని కలిసి వివరాలు సేకరిస్తున్నానని ఆయన అన్నారు. 

Also Read: RGV at YCP MLA House: 'పవన్'ను అమ్మనా బూతులు తిట్టిన ఎమ్మెల్యే ఇంటికి వర్మ!

Also Read: Dil Raju Love Story: 'రెండో భార్యతో లవ్ స్టోరీ' బయటపెట్టిన దిల్ రాజు.. అలా కుదిరేసిందట!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News