Ram Charan - Sukumar: మరోసారి హిట్ కాంబినేషన్‌ను రిపీట్ చేస్తోన్న రామ్ చరణ్..

Ram Charan - Sukumar: సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో, దర్శకుడు కాంబినేషన్‌లో సినిమా హిట్ అయితే.. అదే కాంబినేషన్‌లో మరో సినిమా చేయడానికి మేకర్స్ ఇంట్రెస్ట్ చూపెడతారు. తాజాగా రామ్ చరణ్‌ తనకు గతంలో బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడితో మరోసారి పనిచేయడానికి రెడీ అవుతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 22, 2024, 08:16 AM IST
Ram Charan - Sukumar: మరోసారి హిట్ కాంబినేషన్‌ను రిపీట్ చేస్తోన్న రామ్ చరణ్..

Ram Charan - Sukumar: రామ్ చరణ్‌ హీరోగా ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకున్న నటుడిగా పెద్ద పేరైతే రాలేదు. చిరంజీవి కొడుకుగా డాన్స్, ఫైట్స్‌లలో ఈజ్ చూపించాడు కానీ.. ముఖంలో ఎక్స్‌ప్రెషెన్ పలకించలేడని క్రిటిక్స్ నుంచి విమర్శలు అందుకున్నాడు. అంతకు ముందు కొన్ని చిత్రాల్లో రామ్ చరణ్ నటించినా.. అందులో పెద్దగా యాక్టింగ్‌కు స్కోప్ ఉండకపోయేది. ఇలాంటి టైమ్‌లో  వాటన్నిటికీ చెక్ చెబుతూ సుకుమార్ దర్శకత్వంలో చేసిన 'రంగస్థలం' మూవీతో రామ్ చరణ్‌ కెరీర్‌ను పూర్తిగా చేసింది. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్.. పూర్తిగా మారింది. తనలోని యాక్టింగ్ స్కిల్స్ ఏంటో అందరికీ తెలిసొచ్చేలా ఈ సినిమాలో అద్భుత నటన కనపరిచాడు.  అంతేకాదు ఈ సినిమాలోని నటనతో తిట్టి విమర్శకుల నోళ్లతోనే ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. రంగస్థలం బాక్సాఫీస్ దగ్గర రూ. 125 కోట్ల షేర్.. రూ. 200 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

తాజాగా తనకు నటుడిగా పెద్ద పేరు తీసుకొచ్చిన రంగస్థలం సినిమా దర్శకుడు సుకుమార్‌తో రామ్ చరణ్ మరో సినిమా చేయబోతున్నాడా అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా వీళ్లిద్దరి కాంబినేషన్‌కు సంబంధించిన రెండో మూవీని ఈ నెల 27న రామ్ చరణ్‌ బర్త్ డే సందర్భంగా అఫీషియల్‌గా ప్రకటించనున్నట్టు సమాచారం.

మరోవైపు రామ్ చరణ్.. శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' మూవీ చేస్తున్నారు. ఈ సినిమా టీజర్‌తో పాటు రిలీజ్ డేట్  కూడా ఈ నెల 27న ప్రకటించనున్నారు. మరోవైపు బుచ్చిబాబు సన దర్శకత్వంలో చేస్తోన్న సినిమా టైటిల్‌ను కూడా అదే రోజు రివీల్ చేయనున్నట్టు సమాచారం. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో కథలో కీలకమైన పాత్రలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటించనున్నారు. మరోవైపు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ సినిమాలో ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు. క్రీడా నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

Also Read: Arvind Kejriwal: మద్యం కుంభకోణంలో అనూహ్య మలుపు.. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News