Acharyaలో రామ్ చరణ్ పాత్రపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

Ram Charan As Siddha in Chiranjeevis Acharya Movie: మెగా ఫ్యామిలీ అభిమానులకు, టాలీవుడ్ ప్రేక్షకులకు మెగా అప్‌డేట్ వచ్చేసింది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య. టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో చిరంజీవి సరస కాజల్ అగర్వల్ నటిస్తోంది.

Written by - Shankar Dukanam | Last Updated : Jan 17, 2021, 12:59 PM IST
  • మెగా ఫ్యామిలీ అభిమానులకు, టాలీవుడ్ ప్రేక్షకులకు ఆచార్య నుంచి మెగా అప్‌డేట్
  • టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ మూవీ
  • మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రీలుక్ రివీల్ చేసిన డైరెక్టర్ కొరటాల శివ
Acharyaలో రామ్ చరణ్ పాత్రపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

Ram Charan As Siddha in Chiranjeevis Acharya Movie: మెగా ఫ్యామిలీ అభిమానులకు, టాలీవుడ్ ప్రేక్షకులకు మెగా అప్‌డేట్ వచ్చేసింది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య. టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో చిరంజీవి సరస కాజల్ అగర్వల్ నటిస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నాడతెలిసిందే.

తాజాగా రామ్‌ చరణ్‌ ప్రీ లుక్‌ను ఆచార్య దర్శకుడు కొరటాల శివ రివీల్ చేశారు. మా ‘సిద్ధ’ సర్వం సిద్ధం.. ‘సెట్‌లోకి రాంచరణ్‌కు స్వాగతం పలుకుతూ డైరెక్టర్ కొరటాల శివ ట్వీట్‌ చేశారు. పల్లెటూరి బాక్‌డ్రాప్‌లో ఉన్నట్లు కనపిస్తోంది. మెగా పవర్ స్టార్ చెవికి రింగు, మెడలో రుద్రాక్షతో ఆలయం కోసం ఏర్పాటు చేసిన ఆచార్య సెట్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లుగా రామ్ చరణ్(Ram Charan) కనిపించాడు.

Also Read: Prabhas సలార్ మూవీ గ్రాండ్ లాంచింగ్.. ప్రత్యేక అతిథిగా యశ్

తాజాగా అప్‌డేట్‌తో మెగా అభిమానులు, టాలీవుడ్ ప్రేక్షకులు విశేషంగా స్పందిస్తున్నారు. లాక్‌డౌన్‌ అనంతరం ఆచార్య మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఆ మధ్య చిరంజీవి కరోనా బారిన పడ్డారు. అనంతరం ఆయన కోలుకున్నారు. తరువాత కాజల్ అగర్వాల్ వివాహం, హనీమూన్ కారణంగా కొన్ని రోజులు షూటింగ్ వాయిదా పడింది.

Also Read: Jacqueline Fernandez : జాక్వెలినా ఫెర్నాండెజ్ డ్యాన్స్ రిహార్సల్ ఫోటోలు చూస్తే..కళ్లు తిప్పుకోలేరు మరి

 

 

తాజాగా ఆచార్య షూటింగ్ సెట్లోకి రామ్ చరణ్ రావడంతో చిరంజీవి, చెర్రీ పవర్ ప్యాక్ యాక్టింగ్‌ను త్వలోనే చూస్తామంటూ మెగా ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. ఇటీవల చెర్రీతో పాటు వరుణ్ తేజ్ సైతం కరోనా బారిన పడ్డారు. అనంతరం కోలుకుని అంతా ఓకే అంటూ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పడం తెలిసిందే. 

Also Read: Anasuya: యాంకర్ అనసూయ ట్రెడీషనల్ లుక్ అదుర్స్.. ఫొటోస్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News