Ram Charan - Ananth Ambani Pre Wedding: అనంత్ అంబానీ పెళ్లి వేడుక కోసం రామ్ చరణ్‌కు అందుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Ram Charan - Ananth Ambani Pre Wedding: ఆకాశమంతా పందిరి.. భూదేవి అంత అరుగు అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఆ రేంజ్‌లోనే దేశ కుబేరుడైన ముఖేష్ అంబానీ కుమారుడు అనంత అంబానీ ముందస్తు పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు దేశ, విదేశాలకు చెందిన ఎందరో ప్రముఖులు హాజరయ్యారు. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి రామ్ చరణ్‌కు మాత్రమే ప్రత్యేక ఆహ్వానం అందించింది. ఈ వేడుకకు హాజరు కావడానికి రామ్ చరణ్‌కు భారీ మొత్తంలోనే ముట్టజెప్పినట్టు సమాచారం.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 7, 2024, 11:11 AM IST
Ram Charan - Ananth Ambani Pre Wedding: అనంత్ అంబానీ పెళ్లి వేడుక కోసం రామ్ చరణ్‌కు అందుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Ram Charan - Ananth Ambani Pre Wedding: అనంత్ అంబానీ  సన్నాఫ్ ముఖేష్‌ అంబానీ  ప్రీ వెడ్డింగ్ వేడుక ప్రస్తుతం దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పెళ్లి వేడుకకు దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ పర్సనాలిటీస్ అందరూ గుజరాత్‌లోని జామ్ నగర్‌లో వాలిపోయారు. ఈ వేడుకకు సినీ, వ్యాపార, క్రికెట్ సహా పలు రంగాలకు చెందిన దిగ్గజాలు హాజరై కాబోయే వధూవరులను  ఆశీర్వదిస్తున్నారు. ఈ వేడుకకు మన టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి వెళ్లారు. మన టాలీవుడ్ నుంచి ఈ ఆహ్వానం అందుకున్న ఏకైక కథానాయకుడు రామ్ చరణ్‌ కావడం విశేషం. అటు తమిళనాడు నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ హాజరయ్యారు.

అనంత్ అంబానీ మందస్తు పెళ్లి వేడుకలకు హాజరు అయ్యేందకు వచ్చిన దేశ, విదేశీ సెలబ్రిటీలకు వారి అర్హతను బట్టి అంబానీ భారీ మొత్తంలో ముట్టజెప్పినట్టు సమచారం. ఈ పెళ్లి వేడుకలో షారుఖ్‌, సల్మాన్, ఆమీర్ త్రయం డాన్స్ చేయడానికి ఒక్కొక్కరికి రూ. 50 కోట్ల రెమ్యునరేషన్‌తో పాటు పలు నజరానాలు ఇచ్చినట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అటు రామ్ చరణ్‌కు కూడా రాను పోను ఫ్లైట్ ఖర్చులతో పాటు బస, ఇతరత్రా అన్ని కలిపి అతనికి కూడా రూ. 50 కోట్ల వరకు అంబానీ ఇచ్చినట్టు బీ టౌన్ వర్గాలు చెబుతున్నాయి. అటు క్రికెటర్స్, ఇతర సెలబ్రిటీలకు కూడా వారి రేంజ్‌ను బట్టి భారీగానే ముట్టజెప్పినట్టు సమాచారం.

ఇక అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో షారుఖ్‌ .. రామ్ చరణ్‌ను ఉద్దేశించి చేపిన ఇడ్లీ వడ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకలో
బాలీవుడ్ ఖాన్ త్రయం షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్ ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటకు స్టెప్పలు వేసి అలరించారు. వీళ్లు హుషారుగా డాన్స్ చేస్తోన్న సందర్భంగా షారుఖ్.. రామ్ చరణ్‌ను వేదికపై రమ్మని ఆహ్వానించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్‌ను ఉద్దేశించి 'ఇడ్లీ సాంబార్' పైకి రా అంటూ షారుఖ్ పిలవడం వివాదాస్పద మయింది. షారుఖ్‌కు సౌత్ వాళ్లంటే ఎంత చులకనా అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. సౌత్ హీరోయిన్స్, దర్శకులతో హిట్స్ అందుకున్న కింగ్ ఖాన్.. ఇలా రామ్ చరణ్‌ను ఇడ్లీ, వడ అంటూ సంబోధించడంపై సోషల్ మీడియా వేదిక రామ్ చరణ్‌ అభిమానులు షారుఖ్‌ను తిట్టి పోస్తున్నారు.

రామ్ చరణ్‌ను షారుఖ్‌ పిలిచిన విధానంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. షారుఖ్.. రామ్ చరణ్‌తో ఉన్న చనువు కొద్ది అలా పిలిచానని ఉద్దేశ్యపూర్వకంగా అనలేదని షారుఖ్ ఆ తర్వాత వివరణ ఇచ్చారు. మొత్తంగా అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో ఆయా సెలబ్రిటీల పారితోషకంతో పాటు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి.

Read More: Actress Kajal Agarwal: హీరోయిన్ కాజల్ అగర్వాల్ నడుముపై చెయివేసిన అభిమాని.. సోషల్ మీడియాలో రచ్చగా మారిన వీడియో ఇదే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News