Rakul Preet Singh: ఎవరో ఏదో ఇస్తే.. నేనెందుకు పని చేయాలి

సెలబ్రిటీలపై ఎప్పుడూ కూడా పుకార్లు షికార్లు చేస్తుంటాయి. కొంతమంది వాటిపై స్పందిస్తారు.. మరికొంతమంది వాటిని అస్సలే పట్టించుకోరు. ఈ క్రమంలో తనపై వస్తున్న రూమర్లపై కూడా అస్పలు స్పందించనంటూ టాలీవుడ్ హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌ సింగ్ స్పష్టం చేసింది.

Last Updated : Dec 16, 2020, 08:02 AM IST
Rakul Preet Singh: ఎవరో ఏదో ఇస్తే.. నేనెందుకు పని చేయాలి

Rakul Preet Singh reaction on rumors: సెలబ్రిటీలపై ఎప్పుడూ కూడా పుకార్లు షికార్లు చేస్తుంటాయి. కొంతమంది వాటిపై స్పందిస్తారు.. మరికొంతమంది వాటిని అస్సలే పట్టించుకోరు. ఈ క్రమంలో తనపై వస్తున్న రూమర్లపై కూడా అస్పలు స్పందించనంటూ టాలీవుడ్ హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌ సింగ్ స్పష్టం చేసింది. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని రకుల్ ( Rakul Preet Singh ) సూటిగా చెప్పింది. ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై అక్కినేని సమంత (Samantha Akkineni) హోస్ట్ చేస్తున్న 'సామ్‌జామ్‌' షోకి తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ హాజరైంది. ప్రస్తుతం ఈ షో (sam jam show) కి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ షోకు డైరెక్టర్‌ క్రిష్‌ కూడా హాజరయ్యారు.

షో ప్రోమోలో.. సమంతా ( Samantha ) మాట్లాడుతూ.. మీడియా, సోషల్ మీడియాలో మీపై వస్తున్న వార్తలపై మీరు ఎందుకు స్పందించరు అంటూ ప్రశ్నించగా.. ఎలాంటి తడబాటు లేకుండా రకుల్ ప్రీత్ సింగ్‌ ఆన్సర్ ఇచ్చింది. ‘‘నిజమే.. నాపై రూమర్స్‌ బాగా వస్తున్నాయి. రూమర్స్‌ అని తెలిసినప్పుడు వాటిపై స్పందించడం ఎందుకు అందుకే పట్టించుకోను.. నాకెవరో హైదరాబాద్‌లో ఇల్లు గిఫ్ట్‌గా ఇచ్చారని రూమర్లు పుట్టించారు. నిజంగా నాకు ఎవరో ఇల్లు ఇస్తే.. నేనెందుకు పని చేయాలి. రూమర్స్‌ పుట్టించేవారు ఇష్టం వచ్చినట్లు రాస్తుంటారు. అందుకే వాటిపై అస్సలు స్పందించను.’’ అంటూ రకుల్‌ ప్రీత్ సింగ్ సమాధానమిచ్చింది. Also read: Samantha: ఆ సినిమా నుండి తప్పుకున్న సమంత అక్కినేని

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News