కాలా టీజర్: కాలా అంటే ఏంటో తెలియాలంటే ఈ టీజర్ చూడాల్సిందే!

తమిళ సూపర్ స్టార్ రజీనీకాంత్ అభిమానులు ఎప్పటినుంచో  వేచిచూస్తున్న క్షణం రానేవచ్చింది.

Last Updated : Mar 2, 2018, 03:17 PM IST
కాలా టీజర్: కాలా అంటే ఏంటో తెలియాలంటే ఈ టీజర్ చూడాల్సిందే!

తమిళ సూపర్ స్టార్ రజీనీకాంత్ అభిమానులు ఎప్పటినుంచో  వేచిచూస్తున్న క్షణం రానేవచ్చింది. కబాలి విడుదల తర్వాత రజినీకాంత్ హీరోగా సెట్స్‌పైకి వెళ్లిన కాలా సినిమా టీజ‌ర్ హోలీ సందర్భంగా ఇవాళే అభిమానుల ముందుకొచ్చింది. కబాలి దర్శకుడు పా రంజిత్ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఈ సినిమాకు సంబందించిన త‌మిళ టీజ‌ర్ నిన్న రాత్రే విడుద‌ల అయినప్పటికీ, తెలుగు, హిందీ భాష‌ల‌కి సంబంధించిన టీజ‌ర్ మాత్రం ఇవాళే విడుదలయ్యాయి. ర‌జనీకాంత్ మాఫియా డాన్‌గా నటించడం ఇదేం మొదటిసారి కాదు.. అయినప్పటికీ అతడు మాఫియా డాన్ పాత్ర చేసిన ప్రతీసారి అభిమానులు రజినీకి బ్రహ్మరథం పడుతూనే వున్నారు. కాలా టీజర్ చూస్తోంటే, వండ‌ర్ బార్ ఫిలింస్ బ్యానర్‌పై ధ‌నుష్ నిర్మించిన ఈ సినిమా కూడా రజినీ గత చిత్రాలకు భిన్నమేం కాదనిపిస్తోంది. 

 

"కాలా అంటే ఎవరు.. కాలుడు కరికాలుడు. గొడవపడైనా సరే కాపాడేవాడు.." అంటూ ఈ సినిమాలో సూపర్ స్టార్ పోషించిన కాలా పాత్రకు వున్న ప్రాధాన్యత గురించి పరిచయం చేసే సీన్, డైలాగ్ ఈ టీజర్‌ని వైరల్ అయ్యేలా చేస్తోంది. 'నలుపు.. శ్రమజీవుల వర్ణం.. మా వాడకొచ్చి చూడు.. మురికంతా ఇంద్రధనుస్సులా కనిపిస్తుంది'. 'కాలా అంటే నలుపు.. చావుకే దేవుడు', 'క్యారే.. షట్టింగా' అనే డైలాగ్స్‌ తళైవా ఫ్యాన్స్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ర‌జ‌నీకాంత్ కెరీర్లో164వ సినిమా అయిన కాలా ఏప్రిల్ 27న థియేటర్లలోకి రానుంది. నానా పటేకర్, హుమా ఖురేషి, సంపత్ రాజ్, సముద్రఖని, షియాజీ షిండే లాంటి నటీనటులు ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో రజినీ సరసన ఈశ్వరి రావు జంటగా నటించింది. 

Trending News