Rahul Sipligunj Inspirational Story: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆస్కార్ నామినేషన్స్లోకి ఈ సినిమా నుంచి నాటు నాటు సాంగ్ కి వెళ్లడంతో అందరికీ ఈ సినిమా ఆస్కార్ లభిస్తుందా? లేదా అనే విషయం మీద ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమా పాటను లైవ్ లో పర్ఫార్మ్ చేయమని ఆ సినిమాలో నాటు నాటు సాంగ్ సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఇద్దరినీ ఆస్కార్స్ కమిటీ ఆహ్వానించింది. వీరితో పాటు అక్కడికి కీరవాణి సహ మ్యూజిషియన్స్ కూడా వెళ్లబోతున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా లైవ్ లో పర్ఫార్మ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మీరు గమనిస్తే రాజమౌళి సహా ఆర్ఆర్ఆర్ ద్వారా క్రేజ్ తెచ్చుకున్నా మిగతా వారందరూ సినీ పరిశ్రమలో వారసులుగా ఎంట్రీ ఇచ్చి క్రేజ్ తెచ్చుకున్న వారే.
రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్వయంగా ఒక సినిమా రచయిత కాగా కీరవాణి తండ్రి శివశక్తి దత్తా కూడా అప్పట్లో రచయితగా వ్యవహరించే వారు. కాబట్టి వారు తమ తండ్రుల వారసత్వం అందుకుని సినీ రంగ ప్రవేశం చేశారు. ఇక ఎన్టీఆర్ వంశం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, రామ్ చరణ్ కూడా తండ్రి మెగాస్టార్ చిరంజీవి అడుగుజాడల్లో నడుస్తూ హీరోగా మారాడు. కానీ ఈ ఆస్కార్ వేదిక మీద పర్ఫాం చేయబోతున్న వారిలో రాహుల్ సిప్లిగంజ్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే అతనికి ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదు, హైదరాబాద్ పాతబస్తీ మంగళహాట్ కి చెందిన రాహుల్ సిప్లిగంజ్ కుటుంబం దిగువ మధ్య తరగతి కుటుంబంగా ఉండేది. రాహుల్ సిప్లిగంజ్ తండ్రి బార్బర్ గా పని చేస్తూ తన కుటుంబాన్ని సాకేవాడు.
ఆ తర్వాత సిప్లిగంజ్ ఎదిగిన తరువాత కుటుంబం కుదుట పడిన పరిస్థితి కనిపిస్తోంది. చిన్నప్పుడే రాహుల్ సిప్లిగంజ్ ఇంట్లో ఉండే గిన్నెలు ప్లేట్ల మీద గరిటెలు చెంచాలతో సౌండ్ వచ్చేలా వాయిస్తూ ఫోక్ సాంగ్స్ పాడేవాడట, అయితే అతనికి ఉన్న ఆసక్తి గమనించి సంగీతం నేర్చుకోమని తెలిసిన గజల్ మాస్టర్ దగ్గర ఆయన్ని జాయిన్ చేశారట. నిజానికి మనదేశంలో ఇలా పిల్లల అభిరుచిని బట్టి వారికి ఇతర విషయాల్లో అంటే చదువుని మించి సంగీతం, క్రీడలు అలాగే ఇతర ఆర్ట్స్ వ్యవహారాల మీద శిక్షణ ఇప్పించడం అనేది చాలా తక్కువ శాతం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మన భారతీయ సొసైటీ మైండ్ సెట్ ప్రకారం బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, త్వరగా స్థిరపడిపోతారు అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు.
అందుకే మన స్కూళ్ళకి గ్రౌండ్ ఉండదు మనకి బ్రాడ్ మైండ్ ఉండదు అని చెప్పవచ్చు. రాహుల్ సిప్లిగంజ్ తన తండ్రి తనను ప్రోత్సహించిన నేపథ్యంలో ఆయనకు కూడా అండగా నిలబడాలని భావిస్తూ చదువుకుంటూనే తన తండ్రి పనిచేసే బార్బర్ షాప్ లో సహాయం చేస్తూ మరో పక్క ఖాళీ సమయాల్లో సంగీతం నేర్చుకుంటూ తనకు ఇష్టమైన జానపదాలు పాడుతూ సినిమాల్లో సింగర్ గా ప్రయత్నిస్తూ నెమ్మదిగా ఎవరి ప్రమేయం లేకుండా ఈ రోజు ఆస్కార్ అవార్డుల వేదిక మీద లైవ్ పెర్ఫార్మన్స్ ఇచ్చే స్థాయికి వెళ్ళాడు. ‘’రంగా రంగా రంగస్థలం’’ అంటూ రంగస్థలం సినిమాలో టైటిల్ సాంగ్ పాడిన రాహుల్ సిప్లిగంజ్ కి ఒక్కసారిగా మంచి గుర్తింపు దక్కింది.
తర్వాత బిగ్ బాస్ షో కి వెళ్లి విన్నర్ గా కూడా నిలవడంతో ఆయన తెలుగు ప్రేక్షకులందరికీ పరిచమయ్యాడు. ఇక త్వరలో అంటే మార్చి 12వ తేదీ ఆస్కార్ వేదిక మీద లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వబోతున్నాడు తన తోటి సింగర్ కాలభైరవతో కలిసి. వాస్తవానికి కాలభైరవకి కూడా బ్యాక్ గ్రౌండ్ ఉంది, ఆయన కీరవాణి కుమారుడన్న సంగతి తెలిసిందే. అలా ఈసారి ఆస్కార్ వేదిక మీద ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్వయంగా ఎదుగుతూ వచ్చిన ఒకే ఒక వ్యక్తిగా రాహుల్ సిప్లిగంజ్ నిలవబోతున్నాడు. మన హైదరాబాద్ పాతబస్తీకి చెందిన కుర్రాడు అల్లరి చిల్లరగా తిరుగుతూ వీడేం పనికొస్తాడు అని చుట్టుపక్కల వాళ్ళు అనుకున్న కుర్రాడు, రేపు ఆస్కార్ వేదిక మీద నా పాట చూడు నా ఆట చూడు అంటూ పాడుతుంటే అంతకన్నా కిక్కేముంటుంది.
Also Read: Ashu Reddy Photos: స్కిన్ కలర్ బ్రాలెట్ తో అషురెడ్డి దర్శనం.. అసలేమన్నా వేసుకుందా లేదా అనిపించేలా పూల్ ట్రీట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి