Raghavendra Rao Responds on NTR Health University: విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చడం తెలుగు రాష్ట్రాలలో కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ అధికార వైసీపీని టార్గెట్ చేస్తోంది. అధికార వైసీపీ కూడా తమను తాము వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాము చేసిన పని తప్పేమీ లేదని ఎన్టీఆర్ కంటే వైయస్సార్ పేరు పెట్టడమే కరెక్ట్ అని వారు వాదిస్తున్నారు.
అయితే ఈ విషయం మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులు, తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. నందమూరి కుటుంబం నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అయింది. నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ వంటి వారు ఘాటుగా స్పందిస్తూ లేఖలు విడుదల చేశారు. నందమూరి కళ్యాణ్ రామ్, నారా రోహిత్ వంటి వారు తమదైన శైలిలో కౌంటర్లు వేశారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం చాలా తెలివిగా మాట్లాడుతూ ట్వీట్ చేసిన వ్యవహారం మీద పెద్ద ఎత్తున రచ్చ కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా మరోపక్క దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ఈ విషయం మీద స్పందించారు. ‘’తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన పేరుతో ఉన్న హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం పట్ల తెలుగు తల్లి సిగ్గుపడుతోంది, కన్నీరు పెడుతోంది’’ అంటూ ఆయన తన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఇక నందమూరి బాలకృష్ణ చేసిన కామెంట్ల మీద వైసీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
ఆయన పంచభూతాలు అంటూ పదం వాడటం ఏ మాత్రం కరెక్ట్ కాదని వారంతా తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. పంచ్ డైలాగులు వాడడానికి ఇదేమీ సినిమా కాదని నిజజీవితంలో ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదని వైసీపీ అభిమానులు అందరూ బాలకృష్ణకు సూచనలు చేస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు తగ్గేదే లేదని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ విషయంలో వైసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? మార్చిన పేరును అలాగే కొనసాగిస్తారా? లేక ప్రతిపక్షాల ఒత్తిడి అన్ని వర్గాల నుంచి ఏర్పడుతున్న వ్యతిరేకత నేపథ్యంలో మళ్లీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారా అనేది వేచి చూడాల్సి ఉంది.
Also Read: Jr NTR Foot Nara Dogs: జూ.ఎన్టీఆర్ కాళ్ల దగ్గర నారా కుక్కలు.. సోషల్ మీడియాలో రచ్చ!
Also Read: Prabhas Maruthi Movie: ప్రభాస్ -మారుతి సినిమాలో బాలీవుడ్ హీరో.. పెద్ద ప్లానే ఇది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook