Chandramukhi 2: లారెన్స్ 'చంద్రముఖి 2' పోస్టర్ అదిరింది.. ఫస్ట్ లుక్ వచ్చేది ఎప్పుడంటే?

Chandramukhi 2: రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ టైటిల్ రోల్ లో నటిస్తున్న చిత్రం చంద్రముఖి 2. ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రేపు ఉదయం 10 గంటలకు లాంఛ్ చేయనున్నట్లు ప్రకటిస్తూ.. ఓ పోస్టర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 30, 2023, 04:32 PM IST
Chandramukhi 2: లారెన్స్ 'చంద్రముఖి 2' పోస్టర్ అదిరింది.. ఫస్ట్ లుక్ వచ్చేది ఎప్పుడంటే?

Chandramukhi 2 Movie Update: హీరో రాఘ‌వా లారెన్స్ (Raghava Lawrence) లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం చంద్రముఖి 2 (Chandramukhi 2). పీ వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ క్వీన్‌ కంగనా రనౌత్ (Kangana Ranaut) హీరోయిన్ గా నటిస్తోంది.  చంద్రముఖి 2 ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రేపు ఉదయం 10 గంటలకు లాంఛ్ చేయనున్నట్లు ప్రకటిస్తూ.. ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో రాఘవాలారెన్స్‌ ఓ చేతిలో ఖడ్గం పట్టుకొని యుద్ధవీరుడిలా కనిపిస్తున్నాడు. ఈ లుక్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

చంద్రముఖి 2 తలుపులు గణేశ్‌ చతుర్థికి తెరుచుకోనున్నాయి.ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. సుభాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ కమెడియన్ వడివేలు కీలక పాత్రలో నటిస్తున్నాడు. మహిమా నంబియార్, లక్ష్మీ మీనన్, సిరుష్టి డాంగే, రావు రమేష్, విఘ్నేష్, రవి మారియా, సురేష్ మీనన్, సుభిక్షా కృష్ణన్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. తమిళంతోపాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానున్న ఈ మూవీకి లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. చంద్రముఖి 2 ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబరు 15న విడుదల కానుంది. 

Also Read: Devara Movie: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ఎన్టీఆర్ 'దేవర' స్పెషల్ వీడియో.. మీరు ఓ లుక్కేయండి..

20006 విడుదలైన చంద్రముఖి చిత్రానికి ఇది సీక్వెల్ గా రూపొందుతుంది. రజనీకాంత్ మరియు జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన చంద్రముఖి ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. రజినీ కెరీర్ లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. జ్యోతికకు ఈ సినిమాతో ఎంతో పేరు వచ్చింది. ఈ సినిమాకు కూడా పి. వాసునే దర్శకత్వం వహించడం విశేషం. 

Also read: Sanjay Dutt First look: 'డబుల్ ఇస్మార్ట్‌'లో సంజయ్ దత్.. అంచనాలను పెంచేసిన ఫస్ట్ లుక్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News