Radhe Shyam: రాధే శ్యామ్​ నుంచి వాలెంటైన్స్ గిఫ్ట్​- ప్రభాస్, పూజాల లుక్స్ అదుర్స్​!

Radhe Shyam: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్​, పూజా హెగ్జేలు హీరో, హీరోయిన్లుగా నటించిన రాధే శ్యామ్​ సినిమా నుంచి గిఫ్ట్ వచ్చింది. వాలెంటైన్స్ డే సందర్భంగా స్పెషల్ గ్లిమ్స్ విడుదల చేసింది చిత్ర యూనిట్​.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 14, 2022, 03:21 PM IST
  • ప్రభాస్​ ఫ్యాన్స్​కు రాధేశ్యామ్ టీం గిఫ్ట్​
  • స్పెషల్ గ్లిమ్స్ విడుదల చేసిన చిత్ర బృందం
  • ఆకట్టుకుంటున్న లవ్​ సీన్స్​
Radhe Shyam: రాధే శ్యామ్​ నుంచి వాలెంటైన్స్ గిఫ్ట్​- ప్రభాస్, పూజాల లుక్స్ అదుర్స్​!

Radhe Shyam: ప్రభాస్ ఫ్యాన్స్​కు వాలెంటైన్​ డే గిఫ్ట్ ఇచ్చింది 'రాధే శ్యామ్​' చిత్ర బృందం. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా స్పెషల్ గ్లింప్స్​ను విడుదల చేసింది.

ప్రభాస్ (విక్రమాదిత్య)​, పూజా హెగ్జే (ప్రేరణ)ల మధ్య లవ్​ సీన్స్​తో కూడీన ఈ స్పెషల్ ట్రైలర్​ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ప్రేరణను లవ్​లో పడేసేందుకు విక్రమాదిత్య చేసే పనులు.. హీరో ప్రభాస్​ మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్ చేసే సీన్స్​కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

కరోనా మూడో దశ కారణంగా జనవరిలో విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. దీనితో నిరాశలో ఉన్న ఫ్యాన్స్​కు నిజంగా ఈ ట్రైలర్​ పెద్ద గిఫ్ట్ అనే చెప్పాలి. వాలెంటైన్స్​ డే స్పెషల్ గ్లిమ్స్​ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.

ఇక ఈ వీడియోలోని కొన్ని స్పెషల్ విషయాలు..

1970ల కాలం నాటి లుక్స్​ చాలా బాగున్నాయి. 'కుక్ చేస్తావ్​.. బాగా మాట్లాడతావ్​.. ఇంత మంచి అబ్బాయికి ఇంకా పెళ్లెందుకు కాలేదు?' అని పూజా హెగ్డే ప్రభాస్​ గురించి చెప్పే డైలాగ్ ఇందులో హైలైట్​ అని చెప్పొచ్చు.

రాధే శ్యామ్​ గుగించి..

ఈ సినిమా మార్చి 11న ప్రపంచపవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

రాధా కృష్ణ కుమార్ ఈ సినిమాకు స్టోరీ, దర్శకత్వం వహించారు. టీ సిరీస్​ ఫిలింస్​, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. భూషన్ కుమార్​, వంశి, ప్రమోద్​, ప్రసిద్ధ ప్రొడ్యూసర్లు.

నటీ నటులు..

భాగ్య శ్రీ, కృష్ణం రాజు, సత్య రాజ్​, జగపతి బాబు, సచిన్ కేదార్కర్​, ప్రియదర్శి, మురళి శర్మ, జయరామ్ సహా పలువురు ఈ సినిమాలో నటించారు.

Also read: Gurthunda Seethakalam Trailer: ఆకట్టుకుంటున్న సత్యదేవ్‌ 'గుర్తుందా శీతాకాలం' ట్రైలర్‌

Also read: Sree Leela 'Dhamaka' Look: రవితేజ మూవీ నుంచి 'శ్రీలీల' ఫస్ట్ లుక్ రిలీజ్.. ఎలా ఉందంటే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News