LIGER: నగ్నంగా షాకిచ్చిన విజయ్ దేవరకొండ

LIGER team released vijay devarakonda's Bold Picture:  విజయ్ దేవరకొండ  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా చేస్తున్నాడు. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో సాగుతున్న ఈ సినిమా నుంచి పూర్తిగా నగ్నంగా ఉన్న ఒక ఫోటో షేర్ చేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 2, 2022, 11:13 AM IST
  • విజయ్-పూరీ కాంబోలో లైగర్
  • షాకింగ్ పోస్టర్ రిలీజ్ చేసిన యూనిట్
  • నగ్నంగా దర్శనం ఇచ్చిన విజయ్ దేవరకొండ
 LIGER: నగ్నంగా షాకిచ్చిన విజయ్ దేవరకొండ

LIGER team released Vijay Devarakonda's Bold Picture: అప్పుడెప్పుడో నువ్విలా అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరో అయిపోయాడు. ఆ తర్వాత చేసిన గీత గోవిందం, టాక్సీ వాలా వంటి సినిమాలు ఆయనకు కలిసి రావడంతో మంచి మార్కెట్ కూడా ఏర్పడింది. అయితే ఆ తర్వాత చేసిన డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి సినిమాలు మాత్రం నిరాశ పరిచాయి. ప్రస్తుతం ఆయన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా చేస్తున్నాడు. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో సాగుతున్న ఈ సినిమాలో మొట్ట మొదటిసారిగా ఒరిజినల్ కిక్ బాక్సర్ మైక్ టైసన్ నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.
 
విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాని పూరి కనెక్ట్ బ్యానర్ మీద ఛార్మి, కరణ్ జోహార్ కు చెందిన ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను హిందీలో కరణ్ జోహార్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సంబంధించి మళ్లీ రీ షూటింగ్ జరుగుతోందని ప్రచారం జరిగింది కానీ ఆ విషయం మీద ఇప్పటికీ సరైన క్లారిటీ లేదు. తాజాగా ఈ విషయం మీద సినిమా యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఇటీవల ముంబైలో లీడ్ పెయిర్‌పై ఒక పాటను రూపొందించామని పేర్కొన్నారు.  

ఆగస్టు 25వ తేదీన సినిమా విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు గతంలోనే సినిమా యూనిట్ ప్రకటించింది. ఇప్పుడు మరోసారి అదే విషయాన్ని ఖరారు చేస్తూ ఒక షాకింగ్ పోస్టర్ విడుదల చేసింది సినిమా యూనిట్.. విజయ్ దేవరకొండ పూర్తిగా నగ్నంగా ఉన్న ఒక ఫోటో షేర్ చేశారు కాకపోతే చేతులకు గ్లౌజులు, ఆ చేతుల్లో ఒక ఫ్లవర్ బొకే పట్టుకున్నట్లు చూపించారు. ఫ్లవర్ బొకేతో విజయ్ దేవరకొండ నగ్నంగా నిలబడి ఉన్న పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా ట్యాగ్ లైన్ చాలా క్రాస్ బ్రీడ్ అని ఉండడంతో రకరకాల ఊహాగానాలు అయితే సినిమా గురించి బయటకు వస్తున్నాయి. అయితే ఒక బస్తీ కుర్రవాడు కిక్ బాక్సింగ్ మీద ఉన్న ఇష్టంతో ప్రపంచ స్థాయి బాక్సర్ గా ఎలా ఎదిగాడనే కథను పూరి జగన్నాథ్ చూపించబోతున్నారని తెలుస్తోంది. 

విజయ్ దేవరకొండ ఒక స్టార్ అయినప్పటికీ, తన సినిమాల కోసం ఎంత దూరం వెళ్లడానికి తనకు సంకోచం లేదని ఈ పోస్టర్ ద్వారా చాటిచెప్పినట్టు అయింది. ఈ సినిమాకు విష్ణు శర్మ సినిమాటోగ్రాఫర్‌గా, థాయ్‌లాండ్‌కు చెందిన కెచా స్టంట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా మూవీ 2022 ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇక ఈ సినిమా పూర్తి కాకముందే జనగణమన అనే సినిమా కూడా చేస్తున్నట్లు విజయ్ దేవరకొండ ప్రకటించారు.  ఈ సినిమా కూడా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ సినిమాను పూరి జగన్నాథ్ సొంత బ్యానర్ తో పాటు వంశీ పైడిపల్లి కి చెందిన కొత్త బ్యానర్ కలిసి సంయుక్తంగా నిర్మించనున్నాయి. మరో పక్క విజయ్ దేవరకొండ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటిస్తోంది.

Also Read:  Rajamouli : నా స్వార్ధం అదే.. అసలు విషయం బయట పెట్టిన రాజమౌళి

Also Read: Shruti Haasan: మొట్ట మొదటిసారిగా రిలేషన్ విషయంలో ఓపెనైన శృతి హాసన్.. పెళ్లి మాత్రం?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News