Puri Jagannadh Indirect Warning to Bandla Ganesh: స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి "చోర్ బజార్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్ళిన బండ్ల గణేష్ పూరి గురించి మాట్లాడుతూ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. పూరి జగన్నాథ్ ని అన్నయ్య అని పిలుస్తూ ఆయన భార్య లావణ్యని వదిన అని పిలుస్తూ ఎంతోమంది నార్మల్ స్టార్స్ ని సూపర్ స్టార్స్ గా చేశావు కానీ నీ సొంత కొడుకు సమయం వచ్చేసరికి నువ్వు కనిపించడం లేదని, నీ కొడుకు సినిమా కోసం రాకుండా ముంబైలో ఏం చేస్తున్నావు అని బండ్ల గణేష్ ప్రశ్నించటం వివాదాస్పదంగా మారింది. తాజాగా ఈ విషయం మీద పూరి పరోక్షంగా స్పందించాడు.
బండ్ల గణేష్ అక్కడితో ఆగకుండా పూరి భార్య లావణ్య రామాయణంలో సీత లాగా ఒక ఆదర్శవంతమైన భార్య, చెల్లెలు, తల్లి అని చెప్పిన బండ్ల "మా వదిన భారతమాత కంటే పవిత్రమైనది, గొప్పది, రాంపులు, వ్యాంపులు వస్తుంటారు పోతుంటారు, ఆవిడ మహాతల్లి అంటూ చెప్పుకొచ్చారు. నీ కొడుకు డేట్ల కోసం నువ్వు లైన్ లో నిల్చునే రోజు కూడా వస్తుంది. అప్పుడు నీకు డేట్లు ఇవ్వద్దని ఆకాష్ తో చెప్తానని తనదైన శైలిలో మాట్లాడాడు బండ్ల గణేష్. పూరితో పాటు టాలీవుడ్ స్టార్ హీరోలను, హీరోయిన్ ఛార్మిని పరోక్షంగా విమర్శించాడని అది విన్న ఎవరికైనా అర్థమవుతుంది.
ఈ క్రమంలో దర్శకుడు పూరి నేరుగా కౌంటర్ ఇవ్వలేదు కానీ అతిగా మాట్లాడటం అనర్థం అని అర్ధం వచ్చేలా ఓ మ్యూజింగ్ ను తన యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేశారు. ఆ వీడియోలో పూరి మాట్లాడుతూ ‘గుర్తు పెట్టుకోండి.. మన నాలుక కదులుతున్నంత సేపు మనం ఏమీ నేర్చుకోలేమని అన్నారు. అందుకే జీవితంలో ఎక్కువ సేపు మనం లిజనర్స్ అంటే వినేవారిగా ఉండాలని అన్నారు. అదే మంచిదన్న పూరి ఫ్యామిలీ మెంబర్స్ కావొచ్చు, లేదా మీ ఫ్రెండ్స్ కావొచ్చు.. ఆఫీస్ లో ఎంప్లాయ్స్ కావొచ్చు.. ఆఖరికి కట్టుకున్న భార్య దగ్గర కూడా ఆచితూచి మాట్లాడండని సూచించారు. చీప్‌గా వాగొద్దు.. చీప్‌గా ప్రవర్తించొద్దని అంటూనే మన నాలుక మన కెరీర్‌ను, క్రెడిబులిటీని డిసైడ్ చేస్తుందని అన్నారు.
మీరు వినే ఉంటారు సుమతీ శతకం.. నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ అని ఉంటుంది, అంటే తప్పు మాట్లాడటం కంటే నాలుక కొరికేసుకోవడం చాలా మంచిదని ఆయన చెప్పుకొచ్చారు. నీ లైఫ్, నీ డెత్.. నీ టంగ్ మీద ఆధారపడి ఉంటుంది’ అంటూ పేర్కొనడంతో ఈ వీడియో మీద చర్చ జరుగుతోంది. ఈ విషయంలో పూరీ ఎక్కడా బండ్ల గణేష్ పేరు వాడలేదు కానీ ఆయననే టార్గెట్ చేశారని నెటిజన్లు అంటున్నారు. అంతేకాదు స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారని అంటున్నారు. మరి బండ్ల గణేష్ ఎలా స్పందిస్తారు అనేది చూడాల్సి ఉంది.
Also Read: Ram Gopal Varma - Draupadi Murumu: వివాదాస్పద ట్వీట్ చేసి డిలీట్ చేసిన వర్మ.. మళ్ళీ పొగుడుతూ!
Also Read: Regina Cassandra Pics: తెల్లటి డ్రెస్సులో.. మల్లె పువ్వులా మెరిసిపోతున్న రెజీనా కసాండ్రా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.