Krishna Family: కృష్ణ-విజయనిర్మల ఆస్తుల పంపకాల్లో వివాదం.. అసలు నిజం బయటపెట్టిన నిర్మాత!

Property Disputes in Krishna Family: సూపర్ స్టార్ కృష్ణ మరణం తరువాత మహేష్ బాబు, నరేష్ మధ్య ఆస్తుల పంపకం విషయంలో వివాదం ఏర్పడిందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అసలు విషయం బయట పెట్టాడు నిర్మాత నట్టి కుమార్. ఆ వివరాలు 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 23, 2022, 08:33 AM IST
Krishna Family: కృష్ణ-విజయనిర్మల ఆస్తుల పంపకాల్లో వివాదం.. అసలు నిజం బయటపెట్టిన నిర్మాత!

Property Disputes Between Naresh and Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ మరణం టాలీవుడ్ లో పెను విషాదం నింపిన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ 345 సినిమాల్లో నటించారు. అయితే తాజాగా ఆయన అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. అయితే సూపర్ స్టార్ కృష్ణకు ఇద్దరు భార్యలు కావడంతో ఇప్పుడు వారి ఆస్తుల వ్యవహారం మీద వివాదం చెలరేగిందనే ప్రచారం జరుగుతోంది. సూపర్ స్టార్ కృష్ణ సినిమాల్లోకి రాకముందే తనకు మేనకోడలు వరుసయ్యే ఇందిరా దేవిని వివాహం చేసుకున్నారు.

ఆమె ద్వారా కృష్ణకు ఐదుగురు సంతానం కలిగారు. రమేష్ బాబు, మహేష్ బాబు, మంజుల, పద్మావతి, ఇందిరా ప్రియదర్శిని అనే ఐదుగురికి ఈ జంట జన్మనిచ్చింది. తర్వాత కృష్ణ తనతో పాటు సినిమాల్లో నటిస్తున్న విజయనిర్మలను ప్రేమించి తన మొదటి భార్య ఇందిరా దేవి అనుమతితోనే వివాహం చేసుకున్నారు. వాస్తవానికి విజయనిర్మలతో వివాహం జరిగిన తర్వాతే కృష్ణ ఇందిరాదేవి సంతానంలో కొందరు జన్మించారు. అంటే వీరిద్దరి వివాహాన్ని ఇందిరాదేవి పూర్తిగా అంగీకరించారని అంటూ ఉంటారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News