Priyamani New Movie : గన్ను పట్టిన ప్రియమణి.. ఈ సారి అంతకు మించి అనేలా

Priyamani Dr 56 Motion Poster ప్రియమణి కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ప్రియమణి లీడ్ రోల్లో డాక్టర్ 56 అనే చిత్రం రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ మోషన్ పోస్టర్, రిలీజ్ డేట్‌ను తాజాగా ప్రకటించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 11, 2022, 08:57 PM IST
  • ప్రియమణి కొత్త సినిమా అప్డేట్
  • మోషన్ పోస్టర్‌తో ప్రియమణి సందడి
  • డిసెంబర్లో రాబోతోన్న డాక్టర్ 56
Priyamani New Movie : గన్ను పట్టిన ప్రియమణి.. ఈ సారి అంతకు మించి అనేలా

Priyamani Dr 56 Motion Poster : ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్‌తో ప్రియమణి క్రేజ్ పాన్ ఇండియన్ స్థాయిలో పెరిగింది. లేడీ ఓరియెంటెడ్, స్పెషల్ రోల్స్‌కు ప్రియమణి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. అలాంటి ప్రియమణి మరోసారి ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ బ్యానర్ శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ అందిస్తోండగా.. కథ, కథనాలను ప్రవీణ్‌ సమకూర్చాడు. రాజేష్‌ ఆనందలీల డైరెక్షన్‌లో రాబోతోన్న ఈ చిత్రం నుంచి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది.

ఇది వరకే విజయ్ సేతుపతి చేతుల మీదుగా రిలీజ్ చేయించిన పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన మరో అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ విడుదల తేదీని ప్రకటిస్తూనే.. మోషన్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ మేరకు రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్‌లో ప్రియమణి ఆకట్టుకుంది. ఫ్యామిలీ మెన్ సిరీస్‌లో సాఫ్ట్ కారెక్టర్ పోషించిన ప్రియమణి ఇందులో మాత్రం అంతకు మించి అనేలా యాక్షన్ సీక్వెన్స్ చేసేట్టుకనిపిస్తోంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News