Prasanna Vadanam Movie Review: 'ప్రసన్న వదనం' సినిమాతో సుహాస్ ఖాతాలో మరో హిట్ పడినట్టేనా.. ?

Prasanna Vadanam Movie Review: కలర్ ఫోటో నుంచి సుహాస్ హీరోగా చెలరేగిపోతున్నాడు. ఈ సినిమా తర్వాత 'అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్' 'శ్రీరంగనీతులు' సినిమాలతో మరో హిట్‌ ను అందుకున్నాడు. తాజాగా 'ప్రసన్న వదనం' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమాతో సుహాస్ మరో హిట్‌ అందుకున్నాడా ? లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

Written by - TA Kiran Kumar | Last Updated : May 3, 2024, 11:55 AM IST
Prasanna Vadanam Movie Review: 'ప్రసన్న వదనం' సినిమాతో సుహాస్ ఖాతాలో మరో హిట్ పడినట్టేనా.. ?

రివ్యూ: ప్రసన్న వదనం (Prasanna Vadanam)
నటీనటులు: సుహాస్, రాశి సింగ్, పాయల్ రాధాకృష్ణ, నితిన్, వైవా హర్ష తదితరులు
సినిమాటోగ్రఫీ: ఎస్.చంద్రశేఖరన్
సంగీతం: విజయ్ బుల్గానిన్
నిర్మాత: మణికంఠ జేఎస్
దర్శకత్వం: అర్జున్ వై.కే.  
విడుదల తేది: 3-5-2024

సుహాస్ జర్నీ వైవిధ్యంగా సాగుతోంది. ఫ్యామిలీ డ్రామా, కలర్ ఫోటో, అంబాజీపేట.. ఇలా తన విలక్షణమైన చిత్రలతో ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. తాజాగా 'ప్రసన్న వదనం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సుకుమార్ వద్ద పని చేసిన అర్జున్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు.  ట్రైలర్ లో చూపించిన ఫేస్ బ్లైండ్ నెస్ కాన్సెప్ట్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. మరి ఈ కాన్సెప్ట్ వర్క్ అవుట్ అయ్యిందా? కొత్త దర్శకుడు కొత్త కాన్సెప్ట్ ని ఎలా ప్రజెంట్ చేశాడు ? సుహాస్ ఖాతలో మరో హిట్ పడిందా? మన రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే..

ఓ యాక్సిడెంట్ లో తల్లితండ్రులని కోల్పోతాడు సూర్య(సుహాస్). బోనస్ గా తనకో వింత డిజార్డర్ కూడా వస్తుంది. యాక్సిడెంట్ బలంగా తలకి గాయం అవ్వడంతో ఫేస్ బ్లైండ్ నెస్ డిజార్డర్ వస్తుంది. అంటే .. తను మొహాలని గుర్తుంచలేడు. ఓ ఎఫ్ఎం స్టేషన్ లో ఆర్జే గా పని చేస్తున్న సూర్య ఓ అర్ధరాత్రి దారుణమైన ఘటన చూస్తాడు. అమృత( సాయి శ్వేత)అనే అమ్మాయిని ఎవరో లారీ కింద తోసేస్తారు. ఈ ఘటనని ప్రత్యక్షంగా చూస్తాడు సూర్య. అయితే  తనకి ఫేస్ బ్లైండ్ నెస్ వుండటం కారణంగా ఆ తోసిన వ్యక్తి ఎవరని గుర్తుపట్టలేడు. మరుసటి రోజు అది ఓ యాక్సిడెంట్ ని  వార్తల్లో వస్తుంది. దీంతో బాదితురాలికి న్యాయం జరగాలని భావించిన సూర్య.. పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి జరిగిన అసలు సంగతి చెబుతాడు. ఈ కేసుని ఎసిపీ వైదేహి( రాశి సింగ్) ఎస్ఐ( నితిన్ ప్రసన్న) చాలా సీరియస్ గా తీసుకుంటారు. మరి వారి  విచారణలో ఎలాంటి నిజాలు రాబట్టారు? ఫేస్ బ్లైండ్ నెస్ కారణంగా సూర్య ఎలాంటి కష్టాలు ఎదుర్కున్నాడు ? అసలు అమృతని చంపాల్సిన అవసరం ఎవరికి వుంది ?  ఇవన్నీ తెరపై చూడాలి.

కథనం,టెక్నికల్ విషయాల కొస్తే..
 
ఫేస్ బ్లైండ్ నెస్ కాన్సెప్ట్ తో తెలుగులో ఇప్పటివరకూ సినిమా రాలేదు. ఇలాంటి కొత్త పాయింట్ ని తీసుకున్న దర్శకుడు అర్జున్ ఆ పాయింట్ అంతే కొత్తగా తెరపై చూపించి థ్రిల్ చేశాడు. సూర్య తల్లితండ్రులు యాక్సిడెంట్ లో చనిపోవడం, సూర్యకి ఫేస్ బ్లైండ్ నెస్ రావడం, దాంతో అతను పడే ఇక్కట్లు, అధ్య( పాయల్ రాధకృష్ణ) రూపంలో ఓ క్యూట్ లవ్ స్టొరీ.. ఇవన్నీ ఆసక్తికరంగా ముందుకు సాగుతాయి. కథలో క్రైమ్ ఎలిమెంట్ వచ్చిన  తరవాత కథనం మరింత వేగంగా ముందుకు సాగుతుంది.

ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. నిజమైన థ్రిల్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. సెకండ్ హాఫ్ ని మరింత గ్రిప్పింగ్ గా నడిపాడు దర్శకుడు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ ట్విస్ట్ ని ఎవరూ పసిగట్టలేరు. అంత బలంగా రాసుకున్నాడు దర్శకుడు. క్లైమాక్స్ ఈ సినిమాకి మరో ఆకర్షణ. అప్పటివరకూ కొంత నిదానంగా అనిపించినప్పటికీ ఈ కథకు ఇచ్చిన ముగింపు క్లాప్స్ కొట్టేలా వుంటుంది. దర్శకుడు అర్జున్‌కు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ సినిమా తర్వాత పెద్ద హీరోల నుంచి ఆఫర్ వచ్చినా.. ఆశ్చర్య పనిచేయాల్సిన పనిలేదు. విజయ్ బుల్గానిన్ నేపధ్య సంగీతం కథని ఎలివేట్ చేసింది. కెమరా వర్క్ బాగా ఉంది. ప్రొడక్షన్ డిజైన్ లావిష్ గా వుంది. నిర్మాతలు కథకు కావాల్సిన బడ్జెట్ సమకూర్చారు. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టాడు దర్శకుడు అర్జున్.

నటీనటుల విషయానికొస్తే..

సూర్య పాత్రలో సహజంగా ఒదిగిపోయాడు సుహాస్. ఎమోషనల్ సీన్స్ లో తన నటనతో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీక్వెన్స్ లలో అదరగొట్టాడు. యాక్షన్ ని చాలా రియల్ గా డిజైన్ చేశారు. పాయల్ లవ్ ట్రాక్ బావుంది. ఆ పాత్రని క్లైమాక్స్ లో వాడుకున్న తీరు ఇంకా బావుంది. రాశి సింగ్ పాత్ర గురించి ఎంత చెప్పినా.. తక్కువే.  అది థియేటర్స్ లోనే చూడాలి. నితిన్ మరోసారి సహజత్వంతో ఆకట్టుకున్నాడు. హర్ష కొన్ని సీన్స్ లో నవ్విస్తాడు. రెండు సీన్స్ లో కనిపించిన సత్య కూడా తనవంతుగా నవ్వులు పూయిస్తాడు. నందుతో పాటు మిగతా నటీనటులు  పరిధిమేరకు వున్నారు.

ఇదీ చదవండి:హైదరాబాద్ మెట్రో రైల్ మరో అరుదైన రికార్డ్..

ప్లస్ పాయింట్స్

సుహాస్ నటన

కాన్సెప్ట్

స్క్రీన్ ప్లే, ట్విస్ట్ లు

మైనస్ పాయింట్స్

అక్కడక్కడా నెమ్మదిగా సాగే కథనం,

ఎడిటింగ్  

చివరి మాట.. ఆకట్టుకునే 'ప్రసన్న వదనం'..

రేటింగ్.. 3/5

ఇదీ చదవండి:ఎండలా.. నిప్పులా కొలిమా.. ? పలు రికార్డులు బద్దలు కొడుతున్న ఉష్ణోగ్రతలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

Trending News