Prakash Raj, MAA elections: మా అసోసియేషన్‌ ఎన్నికల్లో నాన్-లోకల్ రాజకీయాలపై ప్రకాశ్ రాజ్ ఫైర్

Prakash Raj about MAA association elections: హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవి పోటీకి దిగాలని తాను ఏడాది కాలంగా భావిస్తున్నట్టు ప్రకాశ్‌‌ రాజ్ తెలిపారు. గత మూడు నెలల నుంచి పరిశ్రమలోని సాటి నటీనటులతో సంప్రదింపులు జరిపాను. పరిశ్రమనే నమ్ముకున్న వారి కోసం ఏర్పడిన మా అసోసియేషన్ అందరికీ ఓ వినోదంలా మారడం బాధాకరం. Prakash Raj pannel in MAA Elections- ప్రకాశ్ రాజ్ ప్యానెల్.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 26, 2021, 08:13 AM IST
Prakash Raj, MAA elections: మా అసోసియేషన్‌ ఎన్నికల్లో నాన్-లోకల్ రాజకీయాలపై ప్రకాశ్ రాజ్ ఫైర్

Prakash Raj about MAA association elections: హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవి పోటీకి దిగాలని తాను ఏడాది కాలంగా భావిస్తున్నట్టు ప్రకాశ్‌‌ రాజ్ తెలిపారు. గత మూడు నెలల నుంచి పరిశ్రమలోని సాటి నటీనటులతో సంప్రదింపులు జరిపాను. పరిశ్రమనే నమ్ముకున్న వారి కోసం ఏర్పడిన మా అసోసియేషన్ అందరికీ ఓ వినోదంలా మారడం బాధాకరం. ఆ భావన తరిమేసి ఒక లక్ష్యంతో అసోసియేషన్‌ను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే మా అసోసియేషన్ ఎన్నికల బరిలోకి దిగినట్టు ప్రకాశ్ రాజ్ చెప్పుకొచ్చారు. 

Prakash Raj appeal to media about MAA elections- మీడియాకు ప్రకాశ్ రాజ్ విజ్ఞప్తి:
నటీనటులందరూ సున్నితమైన వాళ్లే. వాళ్లకు సంబంధించిన మా అసోసియేషన్ ఎన్నికలను ఒక రాజకీయ పోరుగా చూడొద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నట్టు ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. మా అసోసియేషన్‌ను అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో సుస్థిరత నెలకొల్పాలనే ఆలోచనతో ఉన్నాం కానీ పదవుల కోసం పోరాడట్లేదు అని ప్రకాశ్ రాజ్ అభిప్రాయపడ్డారు. 

Also read: Hero Teaser: మహేశ్ మేనల్లుడు హీరో టీజర్‌కు విశేష స్పందన, 4 మిలియన్ల వ్యూస్

Prakash Raj pannel in MAA Elections- ప్రకాశ్ రాజ్ ప్యానెల్:
మా ప్యానెల్‌లో ఉన్న శ్రీకాంత్, జయసుధ, అనసూయ, సనా, ప్రగతి, ఉత్తేజ్ లాంటి వాళ్లంతా ప్రశ్నించే తత్వం ఉన్న వాళ్లే. చివరికి నేను తప్పు చేసినా వాళ్లు నన్ను బయటకు పంపేస్తారు అని ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు. 

Non-local politics in MAA Association- నాన్ లోకల్ రాజకీయాలపై ప్రకాశ్ రాజ్ తీవ్ర అసహనం..
అవార్డులు వచ్చినప్పుడు, గ్రామాలు దత్తత తీసుకున్నప్పుడు, తన అసిస్టెంట్లకు ఇళ్లు కట్టించి ఇచ్చినప్పుడు రాని నాన్ లోకల్ పదం ఇప్పుడు మా అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తా అంటే ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదని ప్రకాశ్ రాజ్ అసహనం వ్యక్తంచేశారు. అసలు మనం ఏ దేశంలో ఉన్నాం ? ఏ సూర్యుడు లోకల్ ఇక్కడ? సినిమా అనేదే ఓ భాష. కళాకారులు ఎప్పుడూ లోకల్ కాదు. నటులంతా యూనివర్సల్ అని భావించాల్సిందే. 

Also read: Lol Salaam Webseries: లాల్ సలామ్ వెబ్ సిరీస్ విడుదల, ZEE5 Appలో వీక్షించండి

Prakash Raj about Chiranjeevi- చిరంజీవిని లాగొద్దు: 
మా అసోసియేషన్ ఎన్నికల మధ్యలోకి చిరంజీవిని ఎందుకు లాగుతున్నారో అర్థం కావడం లేదని ప్రకాశ్ రాజ్ ఆవేదన వ్యక్తంచేశారు. సినిమా వాళ్లంతా ఒక్కటేనని, ఇక్కడ రాజకీయాలు, పార్టీలు అంటూ వేరుగా ఏవీ లేవని తన ప్రత్యర్థులకు కాస్త గట్టిగానే బదులిచ్చారు.

ఇదిలావుంటే, మా అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, నటి హేమ (Manchu Vishnu, Jeevitha, Hema) కూడా పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.

Also read: RRR Movie Resumes Shoot: ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ ప్రారంభం, సెట్లో చేరిన తారక్, చెర్రీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News