Prabhas: ప్రభాస్, హను రాఘవపూడి సినిమాపై లేటెస్ట్ అప్‌డేట్..

Prabhas  - Hanu Raghavapudi: బాహుబలి తర్వాత ప్రభాస్ అన్ని ప్యాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. అందుకే ఇపుడు మారుతి దర్శకత్వంలో ' ది రాజా సాబ్' మూవీ చేస్తున్నాడు. దాంతో పాటు హను రాఘవపూడితో ఓ సినిమా చేయబోతున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక పనికి దర్శకుడు హను శ్రీకారం చుట్టాడట.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 27, 2024, 11:28 AM IST
Prabhas: ప్రభాస్, హను రాఘవపూడి  సినిమాపై లేటెస్ట్ అప్‌డేట్..

Prabhas  - Hanu Raghavapudi: రెబల్ స్టార్ ప్రభాస్ లాస్ట్ ఇయర్ చివర్లో 'సలార్' మూవీతో పలకరించారు. ఈ సినిమాతో హీరోగా మళ్లీ బ్యాక్ బౌన్స్ అయ్యాడు. ఈ సినిమా తెలుగు తప్ప నార్త్, ఇతర ఏరియాల్లో పెద్దగా పర్ఫామ్ చేయలేదు. దీంతో ఈ సినిమా రూ. 650 నుంచి రూ. 700 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది.   ఈ మూవీలో మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ మరో లీడ్ రోల్లో నటించారు.   ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్ చిత్రాన్ని నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. గతేడాది చివర్లో విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ షో నుంచే మంచి టాక్‌తో బాక్సాఫీస్ దుమ్ము దులిపింది. ఇక కన్నడ, ఇతర భాషల్లో పెద్దగా పర్ఫామ్‌ చేయలేదు. ఇక సలార్ మూవీ నైజాం (తెలంగాణ) గడ్డపై రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లతో సంచలనం రేపింది. గతంలో బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ సినిమాల తర్వాత మూడో సినిమాగా ఈ మూవీ రికార్డులకు ఎక్కింది. ప్రస్తుతం ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అటు హిందీ వెర్షన్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇక ప్రభాస్ నటించిన 'సలార్' మూవీని స్పానిష్ భాషలో డబ్ చేసిన మార్చి 7 లాటిన్ అమెరికా దేశాల్లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. మరోవైపు 'సలార్' మూవీని జపాన్‌ దేశంలో సమ్మర్‌లో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ విషయానికొస్తే.. ఇద్దరు ప్రాణ స్నేహితులు..శత్రువులుగా ఎలా మారారనే కథాంశంతో తెరకెక్కింది. ఇక సలార్ రెండో పార్ట్ పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. రెండో పార్ట్‌కు సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం అనే టైటిల్ ఖరారు చేసారు మేకర్స్. ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది.

అటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తోన్న 'కల్కి 2898 AD' మూవీ కూడా ప్యాన్ వరల్డ్ మూవీగా రాబోతుంది. ఈసినిమాతో ప్రభాస్‌తో పాటు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణే వంటి స్టార్స్ నటిస్తున్నారు. మరోవైపు వరుసగా ప్యాన్ ఇండియా స్టోరీలే కాకుండా కాస్త వెరైటీ ఓ సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో మారుతి దర్శకత్వంలో 'ది రాజా సాబ్' మూవీ చేస్తున్నారు. ఇందులో ప్రభాస్ దెయ్యం పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. ఇంకోవైపు హను రాఘవపూడితో ఓ పీరియాడికల్ లవ్ స్టోరీ చేయడానికి ప్లాన్ చేసాడు. సీతారామం తర్వాత హను .. ఇపుడు ప్రభాస్ కోసం వెరైటీ కథను ప్లాన్ చేసాడు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే విశాల్ చంద్రశేఖర్‌తో కలిసి ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేసినట్టు సమాచారం.  ఈ సినిమాను కూడా ' ది రాజా సాబ్' మూవీతో పాటు చేయనున్నాడు.

ఆ సంగతి పక్కన పెడితే.. ప్రభాస్ నటిస్తోన్న మరో భారీ ప్యాన్ వరల్డ్ మూవీ 'కల్కి 2898 AD'. ఈ మూవీని ముందుగా ఈ యేడాది సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ మే 9న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ముందుగా ఈ సినిమా విడుదల తేది వాయిదా పడ్డట్టు వార్తలు వచ్చాయి కానీ.. కానీ సినిమా మే 9న చెప్పిన తేదికే రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా మహాభారతంతో మొదలై 2898 ADతో ముగుస్తుందని చెప్పుకొచ్చారు. మొత్తంగా 6 వేల యేళ్ల ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నట్టు నాగ్ అశ్విన్ చెప్పారు.

నాటి రోజులకు తగ్గట్టు భారతీయత ఉట్టిపడేలా ఓ కొత్త ప్రపంచాన్నే క్రియేట్ చేసారట. ఈ సినిమాలో ప్రముఖ సైన్స్ ఫిక్షన్  హాలీవుడ్ చిత్రం 'బ్లేడ్ రన్నర్' ఛాయలు లేకుండా తెరకెక్కిస్తున్నట్టు చెప్పారు.   అటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' మూవీ చేస్తున్నట్టు ప్రకటించారు. అటు ఫైటర్ మూవీ దర్శకుడు సిద్ఘార్ధ్ ఆనంద్ మూవీ ఉండనే ఉంది.

Also Read: Kuppam: చంద్రబాబును ఓడించండి.. కుప్పం అభివృద్ధి చేసుకుందాం: సీఎం జగన్‌ పిలుపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News