Prabhas in Ayodhya: ఆ రోజున అయోధ్యలో ఆదిపురుష్ టీజర్ లాంచ్.. రావణ దహనం కూడా!

Prabhas to launch Adi purush’s teaser in Ayodhya on October 2: కృష్ణంరాజు మరణించిన బాధలో కూడా ప్రభాస్ తన సినిమాల కోసం బయటకు రాక తప్పడం లేదు. ఆ వివరాల్లోకి వెళితే

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 25, 2022, 04:36 PM IST
Prabhas in Ayodhya: ఆ రోజున అయోధ్యలో ఆదిపురుష్ టీజర్ లాంచ్.. రావణ దహనం కూడా!

Prabhas to launch Adi purush’s teaser in Ayodhya on October 2: బాహుబలి సినిమాతో ప్రభాస్ సూపర్ హిట్ అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ సినిమాతో ఆయన పాన్ ఇండియా లెవల్లో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. అప్పటినుంచి ఆయన ఏ సినిమా చేసినా అది పాన్ ఇండియా లెవెల్ లోనే విడుదలవుతోంది. ఈ బాహుబలి సిరీస్ సినిమా తర్వాత ఆయన సాహో, రాధే శ్యామ్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు.

సాహో సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించక పోయినా బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం బ్రహ్మరథం పట్టారు. ఈ నేపథ్యంలోనే రాధేశ్యామ్ సినిమా అక్కడ కూడా డిజాస్టర్ అయినా ప్రభాస్ కు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇక అక్టోబర్ మూడవ తేదీన ప్రభాస్ నటిస్తున్న ఆది పురుష్ సినిమా టీజర్ రామజన్మభూమి అయోధ్యలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ తాజాగా అందులో కొన్ని మార్పులు చేర్పులు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.

ప్రభాస్ సోమవారం నాడు ఆ టీజర్ లాంచ్ చేయడం లేదని ఆదివారం నాడు అక్టోబర్ రెండవ తేదీన ప్రభాస్ సహా ఆది పురుష్ సినిమా టీంలోని కొంతమంది అయోధ్యలోని రామాలయానికి వెళ్లి అక్కడే తమ సినిమా టీజర్ లాంచ్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఆ తరువాత ఢిల్లీలో జరిగే రావణ దహన కార్యక్రమానికి కూడా ప్రభాస్ ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్నారు. విజయదశమి సందర్భంగా రామలీల మైదానంలో ప్రతి ఏడాది రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు.

ఈసారి కృష్ణంరాజు సహా ప్రభాస్ ను ఆ కార్యక్రమం నిర్వహకులు ఆహ్వానించారు. కృష్ణంరాజు మరణం నేపథ్యంలో ప్రభాస్ ఈ అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉంటాడనే అంచనాలు వచ్చాయి కానీ ప్రభాస్ వాటికి హాజరు అవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కచ్చితంగా ప్రభాస్ ఈ రెండు కార్యక్రమాలకి హాజరవుతాడని అంటున్నారు. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండగా సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. ఈ సినిమా మొత్తాన్ని త్రీడీలో దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తున్నారు.

ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ వంటి వారు ఇతర కీలకపాత్రలలో నటిస్తున్నారు. సినిమా మీద ప్రకటించిన వాటి నుంచే భారీగా అంచనాలైతే నెలకొని ఉన్నాయి. ఈ సినిమాని టీ సిరీస్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించగా తెలుగులో ఈ సినిమాని ప్రభాస్కు చెందిన సొంత సంస్థ యువి ప్రొడక్షన్స్ విడుదల చేస్తోంది. భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా మీద ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ అంచనాలను ప్రభాస్ ఏ మేరకు అందుకోబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. 

Also Read: Twist in Bigg Boss 6: ఇనయా కాదు.. చివరి నిముషంలో బయటకి నేహా., ఎందుకంటే?

Also Read: Mega 154 Surprise: రవితేజ ఒక్కడే కాదు నాగార్జున-వెంకటేష్ కూడా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News